ప్రభుత్వం అనుకునేది ఒకటి అయితే,మీడియా రాస్తున్నది మరొకటి అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు.కొందరు కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.విచ్చలవిడిగా రాయవచ్చనుకునే మీడియా ఉందని అన్నారు.ప్రభుత్వ వార్తలకు సంబంధించి పిచ్చి,పిచ్చి వార్తలు రాస్తున్నాయని అన్నారు. మీడియాకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.ఆర్దిక మంత్రి ఈటెల రాజేందర్ నుంచి అదికారాలు తీసుకుని తాను బడ్జెట్ తయారు చేస్తున్నట్లు టైమ్స్ పత్రిక రాసిందని అన్నారు. ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తమ ప‌్రభుత్వంలో ముఖ్యమైన వ్యక్తి అని అన్నారు. అందరూ కూర్చుని బడ్జెట్ తయారు చేస్తారని,ఇలాంటి వార్తల ద్వారా అగాధం సృష్టించడానికి యత్నిస్తున్నారని అన్నారు.ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఈ ప్రయత్నం జరుగుతోందని,అలాంటి తప్పుడు వార్తలు రాయవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని కెసిఆర్ అన్నారు.ఇప్పటికైనా మీడియా తన ధోరణి మార్చుకోవాలని కెసిఆర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: