ఒక తప్పుతో తెలంగాణ భవిష్యత్తుకు నష్టం జరుగుతోందన్నారు సీఎం కేసీఆర్. హైటెక్స్ లో ప్రభుత్వ సర్వే సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రులు, కలెక్టర్లు, తహశీల్దార్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఒక్క రోజులోనే 84 లక్షల కుటుంబాలపై సర్వే నిర్వహిస్తామని…దీని కోసం 4 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారని కేసీఆర్ చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో జరిగిన అక్రమాలు తేల్చేందుకు సర్కార్ ప్రణాళిక చేస్తుందన్నారు. ఇళ్ల నిర్మాణంలో బొలెడంత అవినీతి జరిగిందన్నారు కేసీఆర్. గత ప్రభుత్వాల హాయాంలో పేదరిక నిర్మూలన ఆశించిన స్థాయిలో జరగలేదన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే కోటి ఆశలు తీరుతాయమన్నారు. పక్కా సమాచారం ఉంటేనే స్కీంలు సక్సెస్ అవుతాయన్నారు కేసీఆర్. ప్రతి ఇంటి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండాలన్నారు కేసీఆర్. ఒక్క క్లిక్ తో మారుమూల గ్రామాల సమాచారం రావాలని..అలాంటి వాటి కోసం సర్వే చేస్తామన్నారు. కేసీఆర్ అర్హులకు ఎట్టి పరిస్ధితుల్లోనూ అన్యాయం జరగనీయమన్నారు కేసీఆర్. అర్హులు కానీ వారిని తప్పుకుండా తొలగిస్తామన్నారు. వ్యవసాయానికి పనికి రాని భూమిలో పరిశ్రమలు స్థాపించడానికి ప్రణాళిక చేస్తామన్నారు. పరిశ్రమలకు అందుబాటులో ఉండే భూమిని సేకరించాలని…ఉన్న భూమిలో వాడుకకు ఎంత ఉందో తేల్చాలన్నారు. రేషన్ కార్డుల్లో ఉన్న అక్రమాలను తేలుస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 84 లక్షల కుటుంబాలుంటే 91 లక్షల వైట్ రేషన్ కార్డులు ఉన్నాయని…మరో 15 లక్షల పింక్ కార్డులున్నాయన్నరు. కుటుంబాలకంటే 21 లక్షల కార్డులు ఎక్కువ ఉన్నాయన్నారు కేసీఆర్. లెక్కల్లో వ్యత్యాసం తేల్చేందుకకే పక్కా సర్వే చేస్తున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: