పిచ్చిరాతలు రాస్తే ఉరుకునేది లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. బడ్జెట్ రూపకల్పనలో ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను పక్కన పెట్టారని ఆంగ్ల పత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ప్రచురితమైన కథనాన్ని శుక్రవారం జరిగిన రెవిన్యూ అధికారుల సదస్సులో ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వాస్తవాలను నిర్దారించుకోకుండా అడ్డగోలు కథనాలు రాసే పత్రికలను ఏవిధంగా నియంత్రించాలన్న దానిపై సమాచారశాఖ అధికారులతో చర్చిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. బడ్జెట్ రూపకల్పనలో అర్థిక మంత్రి ఒక్కరే ఉండరని, అదో టీం వర్క్ అని అందులో ఆర్థిక, ప్రణాళిక, సాధారణ పరిపాలనాశాఖలతో పాటు ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి కూడా ఉంటారని ముఖ్యమంత్రి గుర్తు చేసారు. పిచ్చి, పిచ్చి రాతలు రాసే పత్రికలను మరోసారి హెచ్చరిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: