వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ గుంటూరులో జరిగిన సమీక్ష సమావేశంలో తనకు గొప్ప ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉందని వ్యాఖ్యానించడం విశేషం. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో ఒక భాగం ఇలా ఉంది."ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. అందుకని అబద్ధాలు ఆడి, మోసాలు చేసి గడ్డి తిని ఉంటే .. ప్రజలకు న్యాయం చేయగలమా? నాకూ గొప్ప ముఖ్యమంత్రిని కావాలనే కోరిక ఉంది. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే 30 ఏళ్లు నిజాయితీతో కూడిన పాలన ఇవ్వాలని ఉంది. 30 ఏళ్లు ఎంత మంచి చేయాలంటే ఆ మంచిని చూసి ప్రతి ఇంట్లోనూ నాన్న ఫొటోతో పాటు నా ఫొటో కూడా ఉండాలనే తాపత్రయం ఉంది. ఆ తాపత్రయమే నన్ను ఈరోజు రాజకీయాల్లో నడిపిస్తోంది. అలాంటప్పుడు అబద్ధాలు చెప్పి, మోసం చేసి ఏదో ఒకసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఆ తరువాత ఐదేళ్లకే ఇంటికి పంపించేస్తారు. ఆ తరువాతి ఎన్నికల్లోనూ ప్రజలు మనల్ని నమ్మే పరిస్థితి ఉండదు. అబద్ధాలు చెప్పేవారి ఫొటోలను ఎవ్వరూ ఇళ్లల్లో పెట్టుకోరు. అందుకే చంద్రబాబు మాదిరి అబద్ధాలు చెప్పలేదు. నిజాయితీగా రాజకీయాలు చేశా.\'అని జగన్ వ్యాఖ్యానించారు. జగన్ కోరిక నెరవేరే అవకాశం ఉందా?

మరింత సమాచారం తెలుసుకోండి: