ఆంద్రప్రదేశ్ లో వ్యవసాయం, రుణమాఫీకి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు.ఆయా శాఖలకు కేటాయింపులు,తదితర అంశాలను బడ్జెట్ లో వివరించారు.రెవెన్యూ వసూళ్ల అంచనాలో కొంత కష్టం గా ఉందని అన్నారు. అలాగే ద్రవ్య యాజమాన్య చట్టం కింద అప్పలు పరిమితి మించే అవకాశం ఉందని అన్నారు. ఆధార్ కార్డు ఆధారంగా ప్రభుత్వ పధకాలు అమలు చేస్తామని ఆయన చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు సరిపడా లేవని ఆయన అన్నారు. అయితే కేంద్ర మంత్రి బడ్జెట్ లో ఎపికి విబజన బిల్లు ప్రకారం సహకరిస్తామని చెప్పడం సంతోషమని అన్నారు.కాగా ఎపి ప్రణాళిక వ్యయం 26 వేల కోట్లుగా నిర్ధారించారు. ప్రనాళికేతర వ్యయం 85 వేల కోట్లుగా పేర్కొని మొత్తం లక్షా పదకుండు వేల కోట్లుగా తేల్చారు.సాగునీటికి 8450 కోట్లు, పరిశ్రమలకు 615 కోట్లు ఇవ్వడానికి బడ్జెట్ లో కేటాయింపు చేశారు. గ్రామీణాభివృద్దికి 6400 కోట్లుగా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: