తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ పకడ్బందీ ప్రణాళికి సిద్దం చేస్తుంది .దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ లక్ష్యంతో భాగంగా తెలంగాణ పై బిజేపీ జాతీయ విభాగం కసరత్తు ప్రారంభించింది .ఆపార్టీ అధ్యక్షుడుగా నియమితులైన అమిత్ షా దక్షిణ భారతదేశంలో తొలి పర్యటన లో భాగంగా నేడు హైదరాబాద్ కు వస్తున్నారు.గ్రామ స్థాయినుంచి పార్టీని పటిష్టపరచడమే లక్ష్యంగా ఆయన రెండు రోజుల పాటు పార్టీ నేతలు, కార్యవర్గసభ్యుల నుంచి గ్రామ స్థాయిలో పార్టీ పదాధిపతుల వరకు అందరితో సమావేశమవుతారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వారణాసి నుంచి నేటి మధ్యాహ్నం 3:30 గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌కు చేరుకుని గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం 4:30గంటలకు జరిగే పార్టీ ముఖ్యనేతల సమావేశంలో అమిత్‌షా పాల్గొంటారు. సమావేశం ముగిసిన తర్వాత అమీర్‌పేటలోని చెస్ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర పార్టీ కార్యాలయ పధాదికారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. శుక్రవారం (22న) ఉదయం నగరంలో కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలలో అమిత్‌షా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో గ్రామశాఖ అధ్యక్షులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. సమావేశం అనంతరం గ్రామశాఖ అధ్యక్షులతో ముఖాముఖి మాట్లాడుతారు. అనంతరం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: