ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిపై మళ్లీ ఇంకో మాట చెబుతున్నారు. ఇంతవరకు రాష్ట్రం మధ్యలోనే ఉంటుందని చెబుతూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు రాజధానిపై ఇంకా నిర్ణయం జరగలేదని అన్నారు.తాత్కాలిక రాజధానిగా విజయవాడ అవుతుందని చెప్పిన టిడిపి ముఖ్యనేతలు , శాశ్వత రాజధాని గురించి ఇంకా నిర్ణయంజరగలేదని అంటున్నారను  ోవాలి. ఎన్.టి.ఆర్.ట్రస్టు భవన్ లో టిడిపి ప్రజాప్రతినిదుల వర్క్ షాప్ లో చంద్రబాబు మాట్లాడారు.విభజన వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయని, వాటిని అదిగమించి పనిచేయాలని, పార్టీ , ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు అన్నారు. విభజనతో జరిగిందేదో జరిగిపోయింది.. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని అన్నారు. పేదరిక నిర్మూలన, సమానత్వం ప్రాతిపదికన అభివృద్ది జరగాలని ఆయన అన్నారు.ఎపిలో చేసిన తప్పుతో కాంగ్రెస్ అంతరించిపోయిందని ఆయన అన్నారు.మోడీ ప్రతిపాదించిన డిజిటల్ భారతదేశం అధ్బుతమని,ఎపిని కూడా డిజిటల్ ఏపిగా చేస్తామని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: