లోక్‌సభ ఉప ఎన్నికలపై కాంగ్రెస్‌ నాయకత్వం తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఈ ఎన్ని కల్లో గెలవడం ద్వారా పార్టీ ఉనికిని చాటాలని పరితప్పిస్తున్న కాంగ్రెస్‌ హైకమాండ్‌ సమర్థుడైన అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి ఎంపి కపై ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్‌సింగ్‌ మెదక్‌జిల్లా సీని యర్లతో మంతనాలు జరిపారు. బుధవారంనాడు మెదక్‌జిల్లా కాంగ్రెస్‌ నేతలతో టి పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఓ హోటల్‌నందు సమావేశమై సమీక్షించారు. అభ్యర్థి ఎంపికయే ప్రధాన అజెండాగా జరిగిన ఈ సమావేశంలో టి పిసిసి వర్కిం గ్‌ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సెన్‌, మాజీ ఎమ్మెల్యేలు ముత్యంరెడ్డి, జగ్గారెడ్డి తదితరులు హాజరయ్యారు. తొలుత తెరపైకి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ పార్టీ ముఖ్యనేతల వద్ద వారు పోటీకి సానుకూలంగా స్పందిం చలేదని సమాచారం.ఈ నేపథ్యంలో ఇంకా ఏ అభ్యర్థి అయి తే టిఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వగలడన్న చర్చ ఈ సమావేశం లో ప్రారంభమైంది. దీంతో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనా రాయణ పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. ఆయన సైతం మెదక్‌లోక్‌సభ బరిలో నిలిచేందుకు ఆసక్తిని ప్రదర్శించినట్లు తెలిసింది. ఆయన అభ్యర్థిత్వాన్ని మెదక్‌జిల్లాలోని మెజార్టీ కాంగ్రెస్‌ నేతలు మద్దతు పలికినట్లు తెలిసింది. అయితే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరును మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా తెరపైకి తీసుకొచ్చారు. అదే సందర్భంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌ హుస్సెన్‌ పేరును కూడా కొందరు తెరపైకి తీసుకొచ్చినట్లు తెలిసింది. అదే సందర్భంలో టి పిసిసి మేధావు ల విభాగం నాయకులు శ్యాంమోహన్‌ పేరు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. నేడో, రేపు ఏఐసిసికి జాబితా...? ---------------------------------- మెదక్‌లోక్‌సభ బరిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కోదండ రాం పేరు తెరపైకి వచ్చినా ఆయన అందుకు అంగీకరిస్తారా లేదా అన్న చర్చ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా అభ్యర్థి ఎంపి కపై టి కాంగ్రెస్‌ దృష్టిసారించింది. ఇప్పటికే నలుగురు పేర్లతో తయారు చేసిన జాబితాను గురువారం గానీ శుక్రవారం గానీ ఏఐసిసికి టి పిసిసి నాయకత్వం పంపనున్నట్లు తెలిసింది. సర్వే సత్యనారాయణకు మెదక్‌లోక్‌సభ పరిధిలోని పలు ప్రాం తాల్లో సర్వేకు ప్రజలతో సత్‌సంబంధాలు ఉన్నందన్న పార్టీ హైకమాండ్‌తోనూ మంచి సంబంధాలు ఉన్నందున ఆయన పేరు ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని మెదక్‌జిల్లా కాం గ్రెస్‌ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తెరపైకి జగ్గారెడ్డి పేరు వచ్చినా ఆయనకు అవకాశం దక్కే పరిస్థితి లేదని కొందరు కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్య మం సాగుతున్న సమయంలో నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డికి జగ్గారెడ్డి అం డగా నిలిచారన్న అపవాదు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిగా ఉంటే పార్టీకి నష్టమేనని కొందరు నేతలు అంతర్గ తంగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన పేరు పరిశీలనకు వచ్చే అవకాశంలే దని తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ ఫారుఖ్‌ హుస్సెన్‌కు జిల్లాలో మంచిపేరు, మైనార్టీ నేతగా మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పేరు కూడా పరిశీలనకు వెళ్లిన్నట్లు సమా చారం. టి పిసిసి మేధావుల విభాగం నేత శ్యామోహన్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. సర్వే సత్యనారాయణకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటు న్నాయి. రేసులో ఉన్నా-సర్వే -------------------- మెదక్‌లోక్‌సభ అభ్యర్థిగా కాంగ్రెస్‌ నుంచి పోటీకి దిగే అభ్యరు ్థల రేసులో తాను ఉన్నానని మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వెల్లడించారు. బుధవారంనాడు ఆయన మీడి యాతో మాట్లాడారు. హైకమాండ్‌ టిక్కెట్టు ఇస్తే పోటీ చేస్తానని ఆయన స్పష్టంచేశారు. ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థి ఎంపిక గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి --------------------------------------------------------------------- మెదక్‌లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక ఒకటి, రెండు రోజు ల్లో ఎంపిక పూర్తవుతుందని మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీ తా లక్ష్మారెడ్డి వెల్లడించారు.సమావేశం అనంతరం బుధవారం నాడు వారు మీడియాతో మాట్లాడారు. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీలో చాలా మంది ఉత్సాహం చూపుతున్నారని వారి పేర్లను హైకమాండ్‌కు పంపి ఒకటి,రెండు రోజుల్లో ఎంపి క ప్రక్రియ పూర్తిచేస్తామని వారు వెల్లడించారు. ఇచ్చిన హామీ లను టిఆర్‌ఎస్‌ సర్కార్‌ అమలు చేయకపోవడం కాంగ్రెస్‌ పార్టీకి అనుకూల అంశం అని పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థి ఎవరై నా అతని విజయానికి మెదక్‌జిల్లా కాంగ్రెస్‌ నేతలంతా ఐక్యంగా కృషిచేస్తామని వారు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: