తెలంగాణా బిజేపి పార్టీ బలోపేతానికి వ్యూహరచన చేస్తోంది. అనుకోకుండావస్తున్న మెదక్ ఉపఎన్నికను ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇది కెసిఆర్ ఖాళీ చేసిన సీటుకావడంతో టిఆర్ ఎస్ బలాన్ని చూసి కాంగ్రెస్ టిడిపిలు ఆసక్తి చూపడం లేదు. దీంతో టిఆర్ ఎస్ తో పోటీని పార్టీ అభివృద్ధికి సాధనంగా వాడుకోవాలని బిజేపి వ్యూహం పన్నింది. గెలుపుకన్నా పోటీ చేసినా కూడా పార్టీకి లాభమే అన్న అవగాహనకు బిజేపి నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లో మిత్రపక్షమైన టిడిపి అధికారంలో వుండటంతో ఆ రాష్ట్రంలో బిజేపి ముందటి కాళ్ళకు బంధం పడింది. ఇప్పటికిప్పుడు తెలుగు దేశంపై కత్తులు దూసే పరిస్థితి లేదు. దీంతో తెలంగాణాను ముందుగా బిజేపి తన కార్యక్షేత్రంగా ఎంచుకుంది. ఈ విషయాన్ని స్వయానా బిజేపి ప్రధాన కార్యదర్శి రాంమాధవే ప్రకటించారు.అందుకే ఇంత త్వరగా అమిత్ షా పర్యటనను ఖరారు చేసినట్లు బిజేపి వర్గాలు చెపుతున్నాయి. కేంద్రంలో బిజేపి అధికారంలోకి రావడంతో తెలంగాణాలో కూడా తాము బలపడటానికి అవకాశం వుందని బిజేపి భావిస్తోంది. మెదక్ లో గెలిచే వ్యక్తి కేంద్ర మంత్రి అవుతాడన్న అంశాన్ని ఎన్నికలలో ప్రచారం చేయాలని కూడా బిజేపి ఆలోచిస్తోంది. మెదక్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మిత్రపక్షమైన టిడిపి తో కలిసి మెదక్ లో బిజేపి రైతు నిరసనను నిర్వహించింది. టిఆర్ ఎస్ లో చేరదలచుకుని టిడిపి కాంగ్రెస్ నేతలకు గాలం వేయాలన్నది. అమిత్ షా సూచనగా బిజేపి శిబిరంలో వినిపిస్తోంది. మెదక్ ఎన్నికలను ఇందుకు వేదికగా వాడుకోవాలని కూడా ఆలోచిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: