ఈ సబ్జెక్ట్ కొంచెం టిపికల్, మనసు పెట్టి వినాలి. ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్, అందుకే కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నా.. చాలా మంది ఫేసెస్ డల్ గా ఉన్నాయ్.. మిగిలింది లంచ్ తర్వాత చెబుతా.. చెప్పింది జాగ్రత్తగా వినండి.. చివర్లో డౌట్స్ క్లారిఫికేషన్ కు అవకాశమిస్తే. అప్పుడు డౌట్స్ అడగండి.. ఇలాంటి మాటలన్నీ ఎక్కువగా క్లాస్ రూముల్లో వినిపిస్తాయి. నిన్న ఈ తరహా సంభాషణ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగింది. రాష్ట్రఅభివృద్ధికి తన దగ్గరున్న మాస్టర్ ప్లాన్, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై గురువారం చంద్రబాబు పార్టీ క్యాడర్ కు వర్క్ షాప్ నిర్వహించారు. అందులో ఆయన ప్రొఫెసర్ అవతారం ఎత్తారు. పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి.. దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మ్యాపులు, గ్రాఫిక్స్ సహాయంతో తన ప్రగతి ప్రణాళికలను చంద్రబాబు పార్టీ నాయకులతో పంచుకున్నారు. ఊరికే ఊకదంపుడు ఉపన్యాసం చెప్పకుండా.. చిన్నటార్చ్ తో మ్యాపులపై ఫోకస్ చేస్తూ.. అరటిపండు ఒలిచినట్టుగా ఫ్యూచర్ ప్లాన్స్ వివరించారు. మధ్యాహ్నం మొదలైన ఈ ప్రక్రియ దాదాపు రాత్రి పది గంటల వరకూ కొనసాగింది. కోచింగ్ సెంటర్లలో విశిష్టమైన గెస్ట్ స్పెషలిస్ట్ ఫ్యాకల్టీ వచ్చినప్పుడు.. ఏకధాటిగా ఐదారు గంటల క్లాస్ మధ్య మధ్యలో కాస్త గ్యాపిచ్చి దంచేస్తారు. అదే తరహాలో గురువారం చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఒక ప్రొఫెసర్ తరహాలోనే కాదు.. గురువారం చంద్రబాబులో ఓ మోటివేటర్ కూడా కనిపించారు. శ్రమిద్దాం.. విజయం సాధిద్దాం.. అంటూ క్యాడర్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: