చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులకు అప్పుడే కళ్లునెత్తికెక్కాయట. ఎవరేంచెప్పినా.. డోంట్ కేర్ అంటున్నారట.. అధికారం చేతికొచ్చిన రెండు నెలలే అయినా.. అప్పుడే అధికారగర్వం ఫుల్లుగా మైండ్ కు ఎక్కేసిందట. ఇవన్నీ గిట్టని జగన్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు కాదు. కడుపుకాలిన క్యాడర్ చెబుతున్న అక్కసు మాటలు కావు.. సాక్షాత్తూ వారి బాసు నారా బాబు గారు ధ్రువీకరించిన బ్రహ్మాండమైన వాస్తవం. అప్పుడే తన క్యాబినెట్లో మంత్రులకు కళ్లు నెత్తికెక్కాయని సాక్షాత్తూ ఆయన నోటితో ఆయనే అంగీకరించారు. గురువారం మంత్రులు, ఎమ్మెల్యేలు,ఇతర ప్రజాప్రతినిధులకు జరిగిన పార్టీ వర్క్ షాప్ లో చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారు. మంత్రుల తీరుపై అందరి ముందే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. కొందరు కార్యకర్తలు, ఎమ్మెల్యేలు సొంత పనుల కోసం మంత్రులకు ఫోన్లు కొడుతుంటే.. వారు తీయడం లేదట. ఫోన్ కొట్టగా కొట్టగా ఎప్పటికో తీసినా... వారి విజ్ఞప్తులు పెద్దగా పట్టించుకోవడం లేదట. ఈ మేరకు చంద్రబాబుకు ఇప్పటికే చాలా ఫిర్యాదులు వెళ్లాయట. ఆయన చూసి.. చూసి.. అదను చూసి.. పార్టీ వర్క్ షాప్ లో మంత్రులకు వార్నింగ్ ఇచ్చారట. కార్యకర్తల ఫిర్యాదుల విషయంలోనే కాదు.. ఏకంగా తాను చెప్పిన మాటలు కూడా మంత్రులు పట్టించుకోవడం లేదంటూ.. చంద్రబాబు అమాత్యులపై అంతెత్తున లేచారు. జిల్లాలవారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు మంత్రులకు ఏనాడో చెప్పారు. ఆయన మాటను ఒకరిద్దరు తప్ప ఎవరూ ఖాతరు చేయలేదు. ఇప్పటికే నేను మిమ్మల్ని రెండు మూడు సార్లు కలిశా.. మీరు మాత్రం ఎమ్మెల్యేలతో ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టలేకపోయారంటూ మండిపడ్డారట. అంతే కాదు. మంత్రుల పనితీరుపై తాను చేయించిన సర్వే వివరాలు కూడా అందరి ముందే బయటపెట్టారట. అందులో చాలా మంది మంత్రులు ఫెయిలయ్యారట. ఇలాగైతే మంత్రివర్గ ప్రక్షాళన చేయాల్సి వస్తుంది జాగ్ర్తత్త అంటూ చంద్రబాబు అమాత్యులకు వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: