అధికార పార్టీ ఎమ్మెల్యేలను బఫూన్లుగా అభివర్ణించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు సభ రికార్డుల నుంచి తొలగించారేమో కానీ... అవి వైకాపా అభిమానులను మాత్రం బాగాఆకట్టుకొన్నాయని చెప్పవచ్చు. తమ పార్టీ అధినేత ఈ విధమై అగ్రసివ్ నెస్ ను ప్రదర్శించడం వారిని ఆకట్టుకొనే అంశం అవుతోంది. తెలుగుదేశం లో ఎమ్మెల్యేలు అందరూ కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం.. వేరే పనేమీ లేదన్నట్టుగా అందరూ జగన్ గురించి మాట్లాడే వాళ్లు కావడంతో.. వారిని జగన్ బఫూన్లుగా అభివర్ణించి వెనక్కుతగ్గేలా చేశాడని వైకాపా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే.. కాస్త మీడియాలో కనపడాలనే దుగ్ధ ఉన్న ప్రతివాళ్లూ జగన్ ను విమర్శించే వాళ్లే అయ్యారు.. వారిని వైకాపా సరిగా తిప్పికొట్టలేకపోతోంది.. జగన్ గురించి విమర్శించడం, జగన్ ను అవినీతి పరుడు అని అనడం ఇంకా.. అదుపు తప్పి జగన్ ను దుర్మార్గుడు దుష్టుడు అనడం, జగన్ ను పై తీవ్ర స్థాయి వ్యాఖ్యానాలతో విరుచుకుపడటం చాలా మంది తెలుగుదేశం వాళ్లకు ఒక గొప్ప సంగతి అయ్యింది. జగన్ ను ఏమి తిట్టినా పెద్ద అక్షరాలతో వేసే మీడియా ఉండటంతో వీళ్లు రెచ్చిపోతున్నారు.. అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో జగన్ మోహన్ రెడ్డి ప్రతి అడ్డమైన తెలుగుదశం బఫూన్లతోనూ నేను అనిపించుకోవాలా... సంబంధం లేని వ్యవహారాలన్నింటిలోనూ నన్ను ఇన్ వాల్వ్ చేస్తారా? అంటూ విరుచుకుపడటం మంచి ఎదురుదాడి అని విశ్లేషకులు అంటున్నారు. అది కూడా ఈ వ్యాఖ్యల పట్ల జగన్ వెనకడుగువేయకపోవడం.. తను ఆ మాటలను వెనక్కు తీసుకొనేది లేదని... తనను తెలుగుదేశం వాళ్లు అన్న మాటలను వెనక్కు తీసుకొంటేనే.. తను వాటిని వెనక్కు తీసుకొంటానని అనడం వ్యూహాత్మకంగా ప్లస్ అయ్యింది. ఓవరాల్ గా జగన్ ను తెలుగుదేశం వాళ్లు అన్నమాటలు ఏమిటో కానీ... జగన్ అన్న బఫూన్ అన్నమాటను తెలుగుదేశం వాళ్లు వాళ్లకై వాళ్లు హైలెట్ చేసుకొన్నారు. జగన్ తమను బఫూన్ అన్నాడని నిరసన తెలిపారు. వాళ్లు నిరసన తెలిపినా.. జగన్ ఆ మాటను వెనక్కు తీసుకొని అనడం... వైకాపాకే ఎడ్జ్ అవుతోంది. తను అన్నమాట తప్పేమీ కాదని జగన్ సమర్థించుకోవడంతో... తెలుగుదేశం ఈ వ్యవహారంలో నిరసన తెలిపి కూడా సాధించేందేమీ లేకుండా పోయింది!

మరింత సమాచారం తెలుసుకోండి: