ఇప్పటి వరకూ దాదాపు సగం రాష్ట్రాల్లో తమ వారిని గవర్నర్ లుగా నియమించేసుకొన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్లు. కాంగ్రెస్ నియమిత గవర్నర్ ను నిష్కర్షగా, నిర్మొహమాటంగా వైదొలగమని, అలా వైదొలగని వారిని బదిలీల పేరుతో మార్చి వేసి.. ఇంకా కాదంటే, సీబీఐని ఉసిగొల్పి వారి స్థానంలో తమ వారిని నియమించుకొంటోంది బారతీయ జనతా పార్టీ. రాజకీయాల్లో ఇవన్నీ సహజమే అనుకోవాల్సిన పరిస్థితి. గవర్నర్ లను కాంగ్రెస్ వాళ్లు ఎలా వాడుకొన్నారో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కూడా అదే తీరును కొనసాగించడంలో విచిత్రం ఏమీ లేదు. తమ పార్టీ సీనియర్ నేతలను గవర్నర్ లుగా నియమించుకొంటున్న భారతీయ జనతా పార్టీ తమ మిత్రపక్షాలకు కూడా కోటా ఇస్తుందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. మొత్తం 29 రాష్ట్రాల గవర్నర్ లను, 7 కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ లను మార్చివేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయినట్టుగా ఉంది. మరి మొత్తంగా 35 పదవులు అందుబాటులోకి వచ్చాయి. ఆ నామినేటెడ్ పోస్టుల్లో కొంతమంది మిత్రపక్షాల నేతలను నియమిస్తుందా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. మరి అలా మిత్రపక్షాల కోటాలో పదవులను ఇస్తే.. తెలుగుదేశం కోటాలోకి కూడా పదవులు వస్తాయా?! అనేది ఆసక్తికరంగా మారింది. గతంలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొంతమంది తెలంగాణ తెలుగుదేశం నేతలకు గవర్నర్ పదవులను హామీగా ఇచ్చాడట. కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వస్తే.. నీకు గవర్నర్ పదవి గ్యారెంటీ అని మోత్కుపల్లి నర్సింహులు వంటి వాళ్లకు చెప్పాడట. మరి ఇప్పుడు నిజంగానే అది సాధ్యం అవుతుందా? అనే విషయం గురించి తెలుగుదేశంలోనే చర్చ జరుగుతోంది. అయితే చెన్నమనేనికి మహారాష్ట్ర గవర్నర్ పదవిని ఇవ్వడంతోనే... ఏపీ, తెలంగాణ ల కోటా అయిపోయిందని.. ఈ రాష్ట్రాలకు సంబంధించి మరో వ్యక్తికి గవర్నర్ పదవి దక్కే అవకాశాలు ఇక స్వల్పమేననేది విశ్లేషకుల భావన. మరేం జరుగుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: