రైతాంగ, డ్వాక్రా రుణాలు మాఫీ, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల హామీల అమల్లో రైతులు, మహిళలు నిరుద్యోగులను నిలువునా వంచించే రీతిలో జిమ్మిక్కులు చేస్తున్న చంద్రబాబు బండారాన్ని సమాజానికి చాటి చెప్పేందుకే నందిగామ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఇందులో అధికార దాహం ఆకాంక్ష, రాజకీయ లబ్ధి లేనేలేదని, ప్రజలే న్యాయ నిర్ణేతలని అన్నారు. ఎన్నికల హామీలన్నింటినీ తుచ తప్పక అమలు చేయించడానికి స్థానిక ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరితో మోసపూరిత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ ఉప ఎన్నికను ఓ వజ్రాయుధంలా మలచుకోగలమన్నారు. నందిగామ కాంగ్రెస్ అభ్యర్థి బొడపాటి బాబూరావు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను మాజీ మంత్రి కాండ్రు మురళి ఇతర నాయకులతో పాటు బుధవారం ఉదయం నగరానికి చేరుకున్న బొత్స ఆంధ్రరత్న భవన్‌లో విలేఖర్లతో మాట్లాడారు. టిడిపి అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం కోసం ఆ పార్టీ అధ్యక్షుడు తమతో సంప్రదించలేదని అన్నారు. 2005లో కాంగ్రెస్‌కు చెందిన టెక్కలి ఎమ్మెల్యే రేవతిపతి అకాల మరణంతో జరిగిన ఎన్నికల్లో ఆయన సతీమణి భారతి పోటీ చేస్తుంటే అచ్చెన్నాయుడిని బరిలోకి దించలేదా? అని బొత్స ప్రశ్నించారు. నందిగామలో కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి నామినేషన్ సెప్టెంబర్ 13వ తేదీ జరుగనున్న నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బోడపాటి బాబూరావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తొలుత స్థానిక పార్టీ కార్యాలయంలోరావుకు బొత్స బి ఫారం అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: