ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిగా విజయవాడే రైటనే భావనలో ఉన్నాడు. ఇప్పటికే విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన ఆయన శాశ్వత రాజధానిగా కూడా విజయవాడవైపే మొగ్గు చూపవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఆయన ఎవరు ఏం చెప్పినా వినే అవకాశాలు కనపడటం లేదు. రాజధాని ఏర్పాటు విషయంలో నియమితమైన శివరామకృష్ణన్ కమిటీని డమ్మీని చేసిన ఏపీ ప్రభుత్వం విజయవాడకు మించిన నగరం లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. మరోవైపు విభజన నేపథ్యంలో సీమాంధ్ర సహిత ఆంధ్రప్రదేశ్ లో శ్రీ బాగ్ ఒడంబడికను అమలు చేయాలని రాయలసీమ వాసులుడిమాండ్ చేస్తున్నారు. శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని రాయసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం అసలు శ్రీబాగ్ ఒడంబడిక గురించి గానీ, పెదమనుషుల ఒప్పందం గురించి పట్టించుకొనేలా లేదు! ఇటువంటి నేపథ్యంలో తాజాగా రాయలసీమ రాజధాని సాధన సమితి సభ్యులు ఒకింత తీవ్రమైన హెచ్చరికే జారీ చేశారు. రాజధానిని రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయని పక్షంలో మరో ప్రత్యేక ఉద్యమానికి మేము వెనుకాడము అని వారు అంటున్నారు. ప్రత్యేక రాయలసీమ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మరి వారి హెచ్చిరకను చూస్తే.. చిన్నగానో, పెద్దగానో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం అయితే మొదలు కావడం ఖాయమేనని తెలుస్తోంది. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ లోని అధికారా పార్టీ నేతలు రాయలసీమలో రాజధాని ఉండాలన్న ప్రతిపాదన గురించి ఏం మాట్లాడటం లేదు. అసలు ఆ డిమాండ్ ను వారు ఖాతరు చేయడం లేదు. మరి రాయలసీమ వాళ్లేమో రాజధాని ఇవ్వకపోతే ఉద్యమమే అంటున్నారు. మరి ఉద్యమం తప్పని అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి!

మరింత సమాచారం తెలుసుకోండి: