ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కొత్త ,కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.ఇంతకుముందు మన ఊరు -మన ప్రణాళిక కార్యక్రమాన్ని రూపొందించిన కెసిఆర్ ఇప్పుడు పన్నెండు టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేసి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాలని తలపెట్టారు ప్రణాళికల అమలుకు అవసరమైన నివేదికల తయారీ బాధ్యత ను ఈ టాస్క్ ఫోర్స్ కు అప్పగిస్తారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు కన్వీనర్లుగా.. వాటి అనుబంధ శాఖల కార్యదర్శులు సభ్యులుగా, ప్రభుత్వ సలహాదారులు ప్రత్యేక ఆహ్వానితులుగా పలు టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటయ్యాయి. అవసరమైతే సంబంధిత అంశాల్లో నిపుణులను కూడా చేర్చుకోవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా రంగాలకు సంబంధించి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ కమిటీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.సంక్షేమం, -తాగునీటి సరఫరా,పారిశుధ్ద్యం-,వ్యవసాయం, అనుబంధ రంగాలు, -పరిశ్రమలు, పెట్టుబడులకు ప్రోత్సాహం-- విద్య, మానవనరులు, ఆరోగ్యం.-నీటి పారుదల,నీటివనరులు,-ఇంధనం,- పర్యావరణం-రక్షణ, వనరుల సమీకరణ మొదలైన రంగాలకు ఈ టాస్క్ ఫోర్స్ల లు ఏర్పడ్డాయి. గతంలో విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి శాఖకు సలహా సంఘాన్ని నియమిస్తూ ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం కల్పించారు. ఇవన్ని ఆచరణకు వచ్చేసరికి ముఖ్యమంత్రి ఏమి చెబితే అదే అయ్యే పరిస్తితి ఏర్పడుతుంది. మరి కెసిఆర్ ప్రయోగం ఏమి అవుతుందో చూడాలి.అయితే కొత్త ప్రయోగం చేయడం తప్పు కాదు. అంతిమంగా ప్రజలకు అవినీతి రహిత పాలనను,సమర్ధంగా అందించగలగడం ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: