జంట నగరాల్లో గణేష్ ఉత్సవ శోభ కన్పిస్తోంది. ఓ వైపు మండలాలకు తరలివెళ్తోన్న విగ్రహమూర్తులు.. మరో వైపు పర్యావరణంతో పెరిగిన మట్టి గణేషుల ఆదరణతో భాగ్యనగరం కొత్త శోభను సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేషుడు కూడా కైలాస విశ్వరూప మహా గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఎటు చూసినా పండుగ వాతావరణంతో భాగ్యనగరం కళకళ లాడుతోంది. గణేష్ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. ఏ గల్లీ చూసినా వినాయక మండపాలు… ఉత్సవ మూర్తుల తరలింపుతో నూతన శోభను సంతరించుకుంది. దాదాపు 60 ఏళ్ల చరిత్రకు అద్దంపట్టేలా ఎన్నో ముఖ్య కూడళ్లలో గణేష్ విగ్రహాలు పండుగకు సిద్ధమయ్యాయి. మియాపూర్, దూల్ పేట్, ఉప్పల్, నగర శివారుల్లో వేలాది రూపాల్లో కొలువైన లంబోధరుడు వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్నాడు. దీంతో ఆయా ప్రాంతాల్లో పండుగ వాతావరణం కన్పిస్తోంది.   మరోవైపు 60 వసంతాలు పూర్తి చేసుకోంటున్న ఖైరతాబాద్ గణేషుడు 60 అడుగులతో దర్శనమిస్తున్నాడు. కుంటుంబ సమేతుడై… తల్లిదండ్రి, భార్యలు, సోదరులతో భూలోకానికి వచ్చిన కైలాస విశ్వరూప మహా గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. విగ్రహానికి కుడి వైపు లక్ష్మీ నర్సింహాస్వామి, ఎడమవైపు దుర్గా మాతా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఆసాంఘీక చర్యలకు తావివ్వకుండా.. పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడంచెల భద్రతతో పాటూ.. 16 సీసీ కెమెరాలు, 2 సీఐలు, 10 మంది ఎస్ఐ లు, 200 మంది పోలీసు సిబ్బంది తో డేగ కాపాల కాస్తున్నారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జంటనగరాల భద్రతపై హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. వినాయక మండపాలకు వంద మీటర్ల దూరంలో ఎలాంటి బ్యానర్లు కట్టరాదని ఆదేశించింది. దీంతో జంట నగరాల్లో జరిగే వినాయక ఉత్సవాలకు మరింత భద్రత పెరుగుతుందంటున్నారు మండప నిర్వాహకులు. అయితే ఈ సారి వినాయక విగ్రహల రేట్లు భారీగా పెరిగిపోయాయి. దీనిక తోడు… పర్యావరణ పరిరక్షణ పై ప్రజల్లో పెరిగిన చైతన్యంతో మట్టి గణేషులకే అందరూ జై కొట్టారు. మొత్తానికి భాగ్యనగరం బోలో గణేష్ మహరాజ్ కి జై అన్నా నినాదాలతో మరో మోగుతోంది. చిన్నారులు, పెద్దలు తేడా లేకుండా భారీ ఉత్సవాలకు స్వాగతం పలుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: