వినాయక చవితి పండుగ అంటే రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ లో గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ లోని మహా గణపతి విగ్రహమే..ప్రతి సంవత్సరం భారీ హైట్ తో ఉండే ఈ గణేశుడిని 11 రోజుల పాటు లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. 1954 లో శంకరయ్య అనే ఫ్రీడమ్ ఫైటర్ ఖైరతాబాద్ లో గణేష్ ఉత్సవ సమితి ని స్థాపించాడు. మొదటి సంవత్సరంలో ఒక్క అడుగు వినాయక విగ్రహం తో పూజలు చేసిన ఉత్సవ కమిటీ ప్రతి సంవత్సరం ఒక అడుగు పెంచుతూ వచ్చింది. ప్రతి సంవత్సరం గేణేశుడిని ఒక్కో రూపంలో తయారు చేస్తూ, రూపానికి తగిన పేరుతో పిలుస్తారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఈ సంవత్సరం తో 60 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటున్న సందర్బంగా 60 అడుగుల ఎత్తున్న వినాయకుడి విగ్రహాన్ని పెట్టారు. ఈ వినాయకుడుకి ‘శ్రీ కైలాస విశ్వరూప మహా గణపతి’ గా పేరు పెట్టారు.  గణపతి కి రైట్ సైడ్ లక్ష్మి నరసింహ స్వామి, లెఫ్ట్ సైడ్ దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేశారు. 150 మంది కార్మికులు మూడు నెలల పాటు కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేసారని నిర్వాహకులు చేప్పారు. 40 టన్నుల బరువున్న ఈ విగ్రహానికి తాపేశ్వరం నుండి 5 టన్నుల స్పెషల్ లడ్డును రెడీ చేశారు. ఈ లడ్డును 11 వ రోజు భక్తులకు ఉచితంగా పంచుతారు. ఇంత ఎత్తైన విగ్రహం ఇదే లాస్ట్ అని, వచ్చే సంవత్సరం నుండి హైట్ ను తగ్గిస్తామని ఉత్సవ కమిటీ నిర్వాహకులు అన్నారు. గవర్నర్ నరసింహన్ ఉదయం 10 గంటలకు తొలి పూజ చేయనున్నాడు. సీఎం కేసిఆర్ సాయంత్రం ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పుఉజలు చేయనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: