‘నా కల తెలంగాణ సమగ్ర అభివృద్ధి’ అని సీఎం కేసీఆర్ అన్నారు. మాదాపూర్ హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ప్రాపర్టీ షోను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు తనమీద చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారని, కల సాకారం అయ్యేవరకు విశ్రమించనని అన్నారు. హైదరాబాద్ వ్యాపార, వాణిజ్య రంగాలకు బెస్ట్ ప్లేస్ అని, సింగిల్ విండో విధానంపై వచ్చే శాసనసభ సమావేశాల్లో చట్టం చేస్తాం అన్నారు. హైదరాబాద్‌లో త్వరలోనే నాలా పన్ను రద్దు చేయడం తో పాటు, రూ.10 వేల కోట్లతో వెయ్యి కిలోమీటర్ల రోడ్లను నిర్మిస్తాం అన్నారు. దేశంలోనే అన్ని వసతులు ఉన్న నగరం హైదరాబాద్ అని, హైదరాబాద్‌లో ఉన్న వాతావరణం దేశంలో మరెక్కడా లేదన్నారు. మనకున్న అతిపెద్ద జబ్బు లంచం అని , ఆ లంచం వల్లే మనం వెనకబడుతున్నాం అన్నారు. సింగపూర్ లాంటి చిన్న దేశంలో లంచం అన్న మాటే వినిపించదు అన్నారు. హైదరాబాద్ నగరం జరగాల్సిన పద్ధతిలో డెవలప్మెంట్ కాలేదని త్వరలోనే దేశంలో ఎవరూ ఊహించని విధంగా హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందని కేసీఆర్ అన్నారు. ఈ ప్రోగ్రాంలో డిప్యూటీ సీఎం మహామూద్ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: