రాజధాని ఏర్పాటుపై ఉప ముఖ్యమంత్రి,రెవెన్యూ శాఖ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి చేసిన ప్రకటన ఆశ్చర్యంగా ఉంది.జిల్లాకు ఒక స్మార్ట్ సిటీ ని నిర్మించాకే రాజధాని గురించి ఆలోచిస్తామని కృష్ణమూర్తి వ్యాఖ్యానించినట్లు సమాచారం వస్తోంది.శివరామకృష్ణన్ కమిటీ రాజధానిపై ఇచ్చిన నివేదిక నేపధ్యంలో ఈ పరిణామం సహజంగానే కీలకం అవుతుంది. శివరామ కమిటీ అభిప్రాయాలకు,రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయాలకు మద్య తేడా ఉండడంతో కె.ఇ. ఈ ప్రకటన చేశారా అన్నది చూడాల్సి ఉంటుంది. కె.ఇ. ఈ మాట అన్నది నిజమే అయితే, అది ప్రభుత్వ అభిప్రాయం కూడా అయితే ఇప్పట్లో రాజధానిపై నిర్ణయం చేయడానికి వెనుకాడుతున్నారని అనుకోవాల్సి వస్తుంది. మరి కొద్ది రోజుల క్రితం విజయవాడ వద్ద తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం హడావుడి చేసింది.మరి ఇప్పుడు దానిని కూడా వాయిదా వేసుకుంటారా?

మరింత సమాచారం తెలుసుకోండి: