ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరూ సెప్టెంబర్ రెండో తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. అఖిల భారత సర్వీసు అదికారుల జాబితాను వారు ఖరారు చేయడానికి డిల్లీ వెళుతున్నారని సమాచారం.అక్కడ ప్రత్యూష్ సిన్హా కమిటీతో భేటీ అయిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులలో ఎవరెవరు ఏయే రాష్ట్రాలకు వెళ్లాలో తుది జాబితాను రూపొందిస్తారు. ఆ జాబితాను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆమోదానికి పంపి, ఆ తర్వాత అధికారులను విభజిస్తారు. అదికారులు ఖరారు కాకపోవడం వల్ల రెండు రాష్ట్రాలకు ఇబ్బంది గా ఉందని రెండు ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి లోవెంటనే ఐఎఎస్,ఐపిఎస్, ఐఎఫ్ ఎస్ అదికారుల విభజన పూర్తి చేయడానికి వీలుగా వీరు ఢిల్లీ వెళ్లవచ్చని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: