తెలంగాణ రాష్ట్ర సమితి లోకి భారీగా వలసలు రానున్నాయి. వివిధ పార్టీల్లోని ముఖ్యనేతలు, ఎంపీ , ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో సెప్టెంబర్‌ 5న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమవుతు న్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదే పార్టీకి చెందిన సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య సైతం తెరాసలో చేరేందుకు సిద్ధమైనట్లు సమా చారం. తుమ్మల నాగేశ్వర రావు శనివారం ఖమ్మంలో తన అనుచరులతో సమావే శమై తెలుగుదేశం పార్టీకి రాజీ నామా చేస్తున్నట్లు ప్రకటిం చారు. దీంతో ఆయన వర్గం తెరాసలో చేరడం ఖాయ మైంది. శుక్రవారం రాత్రి తుమ్మ ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును ఆయన నివాసం లో కలుసుకుని చర్చలు కూడా జరిపారు. తుమ్మల చేరికతో ఖమ్మం జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారే పరిస్థితులు కనిపిస్తు న్నాయి. వచ్చే నెల 5 తర్వాత తాను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానో లేదో అన్న విషయాన్ని వెల్లడిస్తానని శనివారం ఉదయం ప్రకటించిన తుమ్మల మధ్యాహ్నానికే తాను తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 5న ఖమ్మం నుండి రెండువేల వాహనాలతో పెద్ద ఎత్తున ర్యాలీగా బయల్దేరి హైదరాబాద్‌కు చేరుకోవాలని తెరాసలో చేరే నాయకులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఖమ్మం జిల్లాలో వైకాపా దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి జిల్లాలో బలమైన క్యాడర్‌ ఉంది. నాయకులకు కూడా కొదువలేదు. ఆ పార్టీ సీనియర్‌ నేత మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఒక వర్గంగా కొనసాగుతున్నారు. తుమ్మలతో ఆయనకు వైరం ఉంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నామాకే ప్రాధాన్యత ఇస్తున్నాడనే భావనతోనే తుమ్మల తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు. మంత్రివర్గంలోకి తుమ్మల త్వరలో జరగబోయే తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో తుమ్మల నాగేశ్వరరావుకు అవకాశం కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీగా ఎంపి కచేసి మంత్రిని చేస్తానన్న హామీతోనే తుమ్మల తెరాసలోకి వస్తున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో తెరాసకు పటిష్టమైన నాయకత్వం లేదు. ఆ పార్టీకి క్యాడర్‌ సైతం నామమాత్రమే. జిల్లాలో కొత్తగూడెం నుండి మాత్రమే జలగం వెంకట్రావు తెరాస అభ్యర్ధిగా ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అయితే కేసీఆర్‌ సామాజికవర్గానికే చెందిన వెంకట్రావుకు కొన్ని పరిస్థితుల దృష్ట్యా మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోయారు. ప్రస్తుతం ఆ జిల్లా నుండి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఒక బలమైన నాయకుడి అవసరాన్ని గుర్తించిన కేసీఆర్‌ గతంలో ఉన్న అనుబంధంతో తుమ్మలను తెరాసలోకి రప్పించడంలో విజయం సాధించారు. తుమ్మలకు జిల్లావ్యాప్తంగా బలమైన అనుచరవర్గం ఉంది. తెలంగాణలో కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకుడెవరూ తెరాసలో లేకపోవడం ఆ పార్టీకి కొంత మైనస్‌గా మారింది. దీంతో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ సామాజికవర్గానికి దగ్గర కావాలనే ప్రయత్నంలోనే తుమ్మలపై వల విసిరారు. ఆయనతోపాటు జెడ్పీ ఛైర్మన్‌, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రావడంతో ఖమ్మం జిల్లాలో తెరాస బలమైన రాజకీయపక్షంగా అవతరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో ఉన్న తొమ్మిదిమంది శాసనసభ్యుల్లో మెజారిటీ తెరాసవైపు వచ్చేట్లుగానే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: