రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని ఏపి సీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం విజయవాడ నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ, బీజేపీలు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నాయన్నారు. నందిగామ ఉప ఎన్నికల్లో వైకాపా, టీడీపీ కుమ్మకయ్యిందని అందుకే నందిగామలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టలేదన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయాడన్నారు. రూ.340 కోట్లు మైనారిటీలకు కేటాయిస్తామని అన్న చంద్రబాబు బడ్జెట్‌లో రూ.5 కోట్లు కేటాయించారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించిందని ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలపై ప్రేమ చూపుతుందని విమర్శించారు. లక్ష కోట్ల రుణమాఫీకి 5వేల కోట్లే కేటాయించడం రైతులను మోసం చేయడమేనన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే జాబు ఇస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే 2500ల ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తొలగించారన్నారు. నిరుద్యోగభృతి ఇస్తామని ఎన్నికల్లో హామీలను ఇచ్చి, బడ్జెట్‌లో అసలు కేటాయింపే జరగలేదని అన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు ఒక మంత్రి పదివి కూడా ఇవ్వలేదని, ఇచ్చిన మాటను చంద్రబాబు తప్పారన్నారు. టీడీపీ, బీజేపీ అవకాశ వాద పార్టీలని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతున్న ఇటు రాష్ట్రంలోను, కేంద్రంలోను ప్రజలకు ఇంతవరకు ప్రవేశపెట్టలేదన్నారు. టీడీపీ పార్టీ గతంలో నియమాలను ఉల్లంఘించిందనే నందిగామలో కాంగ్రెస్‌ అభ్యర్థులను పోటీ చేయిస్తున్నామన్నారు. నందిగామ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపుతధ్యమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్‌, మల్లాది విష్ణు, కడియాల బుచ్చిబాబు, అడపా నాగేంద్ర, ఆకుల శ్రీనివాస్‌, మీసాల రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: