పదహారవ లోక్‌సభ ఏర్పడిన మూడున్నర మాసాల తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టకేలకు వివిధ మంత్రిత్వశాఖల పనితీరును పర్యవేక్షించే పార్లమెంటరీ స్థాయీ సంఘాలను పునర్వ్యవస్థీకరించగలిగింది. సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభలో సంఖ్యాబలం గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా 44కు పడిపోయిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను, సాధారణంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి దక్కాల్సిన డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఇవ్వడానికి నిరాకరించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆయా పార్టీల సంఖ్యాబలం ప్రాతిపదికగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన మొత్తం 24 స్థాయీ సంఘాలలో కాంగ్రెస్‌ పార్టీకి కేవలం అయిదు సంఘాల అధ్యక్ష పదవులతోనే సరిపెట్టింది. డిప్యూటీ స్పీకర్‌ పదవిని దక్కించుకొన్న కారణంగా రెండు స్థాయీ సంఘాల అధ్యక్ష పదవులు చేపట్టేందుకు తగినంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ అన్నా డిఎంకెకు కూడా కేవలం ఒక్క కమిటీని మాత్రమే అప్పగించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ సభ్యులు వీరప్ప మొయిలీ ఆర్థిక శాఖ స్థాయీ సంఘం చౖైెర్మన్‌గా, శశిధరూర్‌ విదేశాంగ శాఖ కమిటీ చౖైెర్మన్‌గా, అశ్వనీ కుమార్‌ శాస్త్ర, సాంకేతిక శాఖ కమిటీ అధ్యక్షునిగా, సుదర్శన్‌ నాచియప్పన్‌ న్యాయశాఖ స్థాయీ సంఘం చౖైెర్మన్‌గా, పి.భట్టాచార్య హోం శాఖ కమిటీ చౖైెర్మన్‌గా వ్యవహరిస్తారని లోక్‌సభ సచివాలయం విడుదల చేసిన బులెటిన్‌ తెలియజేసింది. ఈనెల 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే ఈ స్థాయీ సంఘాల పదవీ కాలం ఏడాదిగా నిర్ణయించారు. ఎన్డీఏ మిత్రపక్షాలైన తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్‌ సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి, శివసేనకు చెందిన ఆనందరావు అడ్సల్‌లతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులిద్దరికి, బిజూ జనతాదళ్‌, అన్నా డీఎంకే, బీఎస్‌పీ, జనతాదళ్‌ (యు) సభ్యులు ఒక్కొక్కరిని స్థాయీ సంఘాల అధ్యక్ష పదవులకు ఎంపిక చేశారు. ఇరవై మంది లోక్‌సభ సభ్యులు, పది మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పాటయ్యే 24 స్థాయీ సంఘాలలో పదహారు సంఘాలకు లోక్‌సభ సభ్యుల నుంచి, ఎనిమిది సంఘాలకు రాజ్యసభ సభ్యుల నుంచి అధ్యక్షులను ఆయా సభల అధ్యక్షులు ఎంపిక చేస్తారు. లోక్‌సభ కోటాలోని మొత్తం పదహారు స్థాయీ సంఘాల చౖైెర్మన్లలో అత్యధికంగా తొమ్మిది కమిటీలకు బీజేపీ సభ్యులు అధ్యక్షులుగా నియమితులు కాగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వీరప్ప మొయిలీ, శశిధరూర్‌లకు మాత్రమే అవకాశం లభించింది. తెలుగుదేశం, శివసేన, త్రిణమూల్‌ కాంగ్రెస్‌, బీజేడీ, అన్నా డిఎంకెలకు ఒక్కొక్క అధ్యక్ష పదవి దక్కింది. రాజ్యసభ కోటాలోని ఎనిమిది ఛైర్మన్‌ పదవులలో సంఖ్యాబలం ప్రాతిపదికగా కాంగ్రెస్‌కు మూడు, బీజేపీకి రెండు, జెెడీయూ, త్రిణమూల్‌ కాంగ్రెస్‌, బీఎస్పీ పార్టీలకు ఒక్కొక్కటి కేటాయించారు. ఫైనాన్స్‌ కమిటీ సభ్యులుగా రాయపాటి, రమేష్‌ అనంతపురం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు తొలిసారిగా ఎన్నికైన సీనియర్‌ నాయకుడు జేసీ దివాకర్‌రెడ్డిని కేంద్ర ఆహార, వినిమయదారుల వ్యవహారాల స్థాయీ సంఘం చౖైెర్మన్‌గా తెలుగు దేశం పార్టీ నామినేట్‌ చేసింది. ఆయనతో పాటు ఆ పార్టీకి చెందిన మరో సీనియర్‌ నాయకుడు, గతంలో యూపీఏ హయాంలో జలవనరుల శాఖకు అనుబంధంగా ఉన్నత స్థాయీ సంఘం చౖైెర్మన్‌గా వ్యవహరించిన మరో సీనియర్‌ నాయకుడు రాయపాటి సాంబశివరావుతో పాటు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌లు ఆర్థికశాఖ స్థాయీ సంఘం సభ్యులుగా నియమితులయ్యా రు. రాష్ట్రానికి చెందిన మొత్తం 60 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులలో కేంద్ర మంత్రి పి.అశోక్‌ గజపతి రాజు మినహా మిగిలిన సభ్యులలో 55 మంది కూడా ఆయా స్థాయీ సంఘాల సభ్యులుగా నియమితులయ్యారు. మెదక్‌ నియోజకవర్గం ఖాళీగా ఉండడంతో పాటు నంద్యాల ఎంపీ ఎస్‌.పి.వై.రెడ్డి, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌లకు ఏ కమిటీ లోనూ స్థానం లభించలేదు. రాష్ట్రానికి చెందిన పార్లమెంట్‌ సభ్యులు అత్యధికంగా అయిదుగురు చొప్పున గ్రామీణాభి వృద్ధి, వాణిజ్య శాఖల స్థాయీ సంఘాలను ఎంచుకోగా, పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ, ఇంధన శాఖ, రైల్వే, జలవనరుల శాఖల స్థాయీ సంఘాలలో రాష్ట్రానికి చెందిన నలుగురేసి సభ్యులకు స్థానం దక్కింది. రాష్ట్ర ఎంపీలు ఎంచుకొన్న స్థాయీ సంఘాల వివరాలు ఇలా ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: