ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) టెర్రరిస్ట్ లు మరో అమెరికన్ జర్నలిస్టును దారుణంగా చంపారు. ఫ్లోరిడా కు చెందిన స్టీవెన్ జే.సోట్లాఫ్‌కు తల నరికి చంపినట్టుగా పేర్కొంటూ ఓ వీడియోను ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు. ‘సెకండ్ వార్నింగ్ అమెరికా’ పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలో ‘ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ లపై అమెరికా దాడులకు మూల్యం చెల్లించుకుంటున్నా’అని సోట్లాఫ్‌ చెబుతున్నట్లుగా ఉంది. తమ వద్ద బందీగా ఉన్న బ్రిటన్ పౌరుడు డేవిడ్ హైన్స్‌ను కూడా చంపేస్తామని టెర్రరిస్ట్ లు ఇందులో హెచ్చరించారు. కానీ, వైట్ హౌస్ ప్రతినిధులు మాత్రం ఈ వీడియో నిజమైనదో కాదో అని అనుమానం వ్యక్తం చేసాయి. అమెరికన్ జర్నలిస్ట్ ను చంపినట్టుగా పోస్ట్ చేసిన వీడియో ను అధ్యయనం చేస్తున్నామని, దానిపై అప్పుడే ఒక క్లారిటీకి రాలేమని జోష్ ఎర్నెస్ట్ అనే వైట్ హౌస్ ప్రతినిధి అన్నాడు. మరో జర్నలిస్టు జేమ్స్ ఫొలేను ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్ట్ లు తలనరికి చంపిన వీడియోను రెండు వారాల కింద రిలీజ్ చేశారు. అప్పటికే సోట్లాఫ్‌ కూడా టెర్రరిస్ట్ ల చేతిలో బందీగా ఉన్నట్టు ఇరాక్ అధికారులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: