చమురు అన్వేషణ కాంట్రాక్టులలో రిల యన్స్‌ ప్రయోజనాలకు విఘాతం కల్గించే విధంగా వ్యవహరించరాదని అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తమను ఆదేశించారని మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వినోద్‌ రారు మరో ఆరో పణకు దిగారు. 2జి స్కాం, ఆ తరువాత కోల్‌గేట్‌ వంటి వ్యవహారాలలో ప్రధాని స్థాయిలో ఉన్న మన్మోహన్‌ సింగ్‌ ప్రేక్షక పాత్ర వల్లనే దేశ ఖజానాకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లిందని, పైగా ఆయన మంత్రివర్గ సీనియర్లు కొందరు 2జి విషయంలో మన్మోహన్‌ను హెచ్చరించినా ఆయన పట్టించుకో లేదని ఇటీవలే వినోద్‌రారు తెలిపారు. దీనిపై తీవ్రస్థాయిలో చర్చ జోరందుకుంది. ఈ దశలోనే అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తన గణాంక విధులకు పరోక్షంగా అడ్డుతగిలారని, రిలయన్స్‌కు ఇబ్బంది కల్గించే విధంగా ఎలాంటి గణాంక అంశా లను చేపట్టరాదని, అవకతవకలు వెలుగులోకి వచ్చినా, వాటిని చూసీ చూడనట్లుగా వదిలేయాలని మన్మోహన్‌ తమను ఆదేశించారని మాజీ కాగ్‌ ఇప్పుడు కడిగిపారేశారు. రిలయన్స్‌ సంస్థతో కుదిరే ఒప్పందం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడుతా యని, గ్యాస్‌ అన్వేషణా కార్యక్రమంలో ఆర్‌ఐఎల్‌కు మొగ్గు చూపడం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి కాగ్‌ స్థాయిలో తాను గణాంకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని వినోద్‌ రారు తెలిపారు. రిలయన్స్‌ సంస్థ దేశంలో ప్రతిష్టాత్మకం, పెద్ద సంస్థ కాబట్టి, దానికి ప్రతికూలంగా ఉండే గణాంక నివేదికలను పట్టించుకోవద్దని మన్మోహన్‌ చెప్పారని వినోద్‌ రారు ఇప్పుడు చెపుతున్నారు.  ప్రత్యేకించి కృష్ణా గోదావరి బేసిన్‌లో రిలయన్స్‌ సంస్థకు కేటాయించిన తవ్వకా లకు సంబంధించి ప్రభుత్వమే ఆడిటింగ్‌కు ఆదేశాలు ఇచ్చింది. ఆ తరువాత నిజంగానే రిలయన్స్‌ సంస్థకు కేటాయింపులు వివాదాస్పదంగా ఉన్నాయని వెల్లడి అయింది. పైగా తమకు సదరు సంస్థ నుంచి దర్యా ప్తు సందర్భంగా ఎలాంటి సహకారం అందలేదని, ఖాతా పుస్తకాలను ఇవ్వడానికి కూడా సంస్థ వారు నిరాకరించారని కాగ్‌ మాజీ తెలిపారు. దీనిని తాను మన్మోహన్‌ దృష్టికి తీసుకువెళ్లానని, అయితే ఓ పెద్ద సంస్థ పెట్టుబడులతో ముందుకు వస్తోందని, ఆ సంస్థ ఉత్సాహాన్ని నీరుగార్చే విధంగా ఏ స్థాయిలో నూ వ్యవహరించకుండా ఉంటే బాగుంటుందని ఆయన తనకు సలహా ఇచ్చారని వినోద్‌రారు తెలి పారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ తప్పులెంచడం ఎందుకని ఆయన చెప్పారని ఆరోపించారు. ప్రపంచ స్థాయి బిడ్స్‌ను తట్టుకుని పోటీలో నిలిచే సామర్థ్యం రిలయన్స్‌కుందని, వృత్తి పరంగా, ఆర్థికపరంగా సత్తా ఉన్న కంపెనీతో ఎందు కొచ్చిన గొడవ అని ఆయన తెలిపారని వినోద్‌రారు తెలిపారు. ఈ వ్యవహారాలన్నింటిపైనా కాగ్‌ మాజీ ఇప్పుడు ఏకంగా తన పుస్తకంలో ఏకరువు పెట్టారు.  బొగ్గు కేటాయింపులు, 2జి స్పెక్ట్రమ్‌ స్కామ్‌లలో భారీ స్థాయి కుంభకోణాలకు మన్మోహన్‌ నిర్లిప్తత లేదా ఆయన పరోక్ష ప్రమేయమే కారణమని వినో ద్‌రారు ఈ పుస్తకాన్ని అస్త్రంగా సంధించడం రాజ కీయ వర్గాలలో సంచలనానికి దారితీసింది. ప్రభు త్వం ఆహ్వానించిన తరువాతనే కెజి బేసిన్‌లో ఆడిటిం గ్‌కు కాగ్‌ చర్యలు చేపట్టిందని, అయినా ప్రజాస్వా మ్యంలో ఎక్కడైనా ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యపు అన్వేషణా కార్యక్రమాలలో నిబద్ధతనే కాగ్‌ నిశితంగా పరిశీలిస్తుందని, అయితే దర్యాప్తు సాగించుకోవచ్చు నని చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత నివేదికను లైట్‌గా తీసుకోవాలని చెప్పడం ఎంతవరకు సబబని వినోద్‌రారు ప్రశ్నిస్తున్నారు. రారు తమ పుస్తకంలో ప్రత్యేకంగా ఈ కెజి బేసిన్‌ ఒప్పందంలో రిలయన్స్‌ నిర్వాకం గురించి ప్రస్తావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: