తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక హైదరాబాద్‌కు ఇమేజ్‌ తగ్గిందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విద్యా శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఉగ్ర రూపుడై గర్జించారు. ఆదివారం నల్లగొండ జిల్లా, కోదాడ పబ్లిక్‌ క్లబ్‌ ఆడిటోరియంలో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి ఆవేశంగా ప్రసంగిం చారు. ఇమేజ్‌ తగ్గింది హైదరాబాద్‌కు కాదని, కాంగ్రెస్‌ పార్టీకి, సోనియా గాంధీకేనని తీవ్రస్థాయిలో విమర్శించారు. హైదరాబాద్‌ను అవమానిస్తూ మాట్లాడిన జైపాల్‌రెడ్డి హైదరా బాద్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణా కోసం ఏనా డూ పోరాటం చేయని జైపాల్‌రెడ్డి తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఫోజులు కొడుతున్నాడని మండిప డ్డారు. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పొన్నాల.. నిన్ను పాతరేస్తామని హెచ్చ రించారు. జానారెడ్డీ ,,,నువ్వు జర జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. పొన్నాల, జానా, జైపాల్‌రెడ్డిలు పచ్చకామెర్లు వచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా రని, కార్యకర్తలు వారి దుష్ప్రచా రాన్ని తిప్పికొట్టాలని హితవు పలికారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడ కుండా ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామ న్నారు. మెదక్‌ ఉప ఎన్నిక ఫలితం వెలువడ్డాక మీ బతుకేందో తెలుస్తుం దని దుమ్మెత్తి పోశారు. కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాక, ఇవ్వని హామీలను సైతం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడని, ఏ ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచించలేద న్నారు. వందరోజుల తమ ప్రభుత్వ పాలనలో వంద సంవత్స రాలకు సరిపడే ప్రణాళికలను కేసీఆర్‌ తయారు చేశారన్నారు. ఏ ప్రభుత్వం చేయనంత వేగంగా మా ప్రభుత్వం పనిచేస్తుంద న్నారు. గత ప్రభుత్వాలు ధ్వంసం చేసిన ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను, పథకాలను సరిచేస్తూ వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తూనే తాము ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు ముందు కు వెళుతున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ తోనే భవిష్యత్‌ అని అందరు విశ్వసిస్తున్నందునే ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేరుతున్నారన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, కోదాడ మాజీ సర్పంచ్‌ పార సీతయ్య, వల్లూరి రామిరెడ్డి పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: