భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మదర్సాలపై దృష్టి పెట్టనుందా? అక్కడ జరుగుతున్న కార్యకలాపాల గురించి ఒక లుక్ వేయాలని నిర్ణయించిందా? ఇస్లామిక్ విద్యాబోధ రూపంలో ముస్లిం అధికారిక విద్యాలయాల్లో ఏం జరుగుతోందో.. తెలుసుకోవాలని అనుకొంటోందా? ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అరికట్టడానికి మదర్సాలపై కన్నేయడం కూడా ఒక పద్ధతి అని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు మదర్సాలపై విమర్శలు చేశారు. అక్కడ ఉగ్రవాదులను తయారు చేయడం జరుగుతోందని వారు ధ్వజమెత్తారు. మదర్సాల్లో మతమౌడ్యాన్ని నింపే ప్రయత్నాలు జరుగుతన్నాయని... భారతదేశంలోని మదర్సాల్లో ఉగ్రవాద శిక్షణ కార్యకలపాలు జరుగుతున్నాయని వారు అంటున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఈ విధంగా మాట్లాడటం విశేషం. ప్రత్యేకించి హిందూ, ముస్లింల మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్న ఉత్తరప్రదేశ్ కు చెందిన ఎంపీలు ఇలాంటి ప్రకటన చేస్తున్నారు. మదర్సాలు జాతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని.. ఉగ్రవాదులను తయారు చేసి దేశం మీదికి వదులుతున్నాయని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో వాటి పనితీరుపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని భారతీయ జనతా పార్టీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.మరి హిందుత్వ వాదంతో అధికారాన్ని చేపట్టిన భారతీయ జనతా పార్టీ అనుమానాస్పద కార్యకలాపాలపై దృష్టి పెట్టడంలో పెద్దగా విచిత్రం ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ వైపు నుంచినే మదర్సాలపై విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: