కాశ్మీర్‌ వరదల్లో భారతీయ క్రికెటర్‌ చిక్కుకున్నారు.. దేశానికి ప్రతినిధ్యం వహించిన తొలి కాశ్మీర్‌ ఆటగాడు.. ఇప్పుడు బంధువుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాడు. జాతీయ జట్టులో స్థానం సాధించడానికి కారణమైన బ్యాట్‌ను ప్రాణాలకు తెగించి కాపాడుకున్న ఈ ఆటగాడు.. లోయల్ని వణికించిన ప్రళయానికి ప్రత్యక్షసాక్షిగా మారాడు. పర్వేజ్‌ రసూల్‌.. జమ్మూ కాశ్మీర్‌ నుంచి భారత్‌ క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి ఆటగాడు. ఈ ఏడాది జూన్‌లో బంబగ్లాదేశ్‌ సీరిస్‌తో అడుగుపెట్టిన రసూల్‌ వరదల్లో చిక్కుకున్నాడు. ప్రస్తుతం కుటుంబసభ్యలుతో కలిసి మూడో అంతస్థులోని చిన్న గదిలో ఉన్నాడు. శ్రీనగర్‌కు 40 కి.మీ దూరంలో నివాసం ఉండే పర్వేజ్‌ రసూల్‌... వరదల్లో ప్రత్యక్ష నరకం అనుభవించాడట. పోన్లు పనిచేయ లేదు.. రేడియోలు, టీవీలు లేవు. ఎం జరుగుతుందో తెలియనంతగా బాహ్యప్రపంచంతో సంబంధాలు కట్‌ అయ్యాయి. అంతకంటే కూడా తనకు కలిసివచ్చిన బ్యాట్‌ను ప్రాణాలకు తెగించి నీటిలో దూకి కాపాడుకున్నాడట. తన క్రికెట్‌ కిట్‌ మొత్తం పై అంతస్తుకు మార్చినా.. కారులో ఉన్న బ్యాట్‌ను మర్చిపోయాడట. అంతే వరద నీరు ముంచెత్తినా లెక్క చేయకుండా నీళ్లలోకి దూకి క్షేమంగా తెచ్చుకున్నాడట. రంజీ మ్యాచ్‌లలో 650 పరుగులు చేసింది ఈ బ్యాట్‌తోనే.. అందుకే అంత రిస్క్‌ చేసినట్టు చెబుతున్నారు. జాతీయ జట్టులో స్థానం సంపాదించడానికి రంజీ స్కోరు కారణం. బ్యాట్‌ను అయితే కాపాడుకున్నాడు.. కానీ రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ చేసే పిచ్‌ మాత్రం పూర్తిగా పాడైందట.. దీంతో రంజీలో ఆడేందుకు సిద్దమవుతున్న రసూల్‌ ఢిల్లీకి మకాం మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: