రఘువీరారెడ్డి ఆసక్తికర విషయం చెప్పారు. తెలుగుదేశం వెబ్ పైట్ నుంచి ఆ పార్టీ ఎన్నికల మానిఫెస్టోని, రుణమాఫీకి సంబందించిన అంశాలను తొలగించారని ఆయన వెల్లడించారు. ఇది ఆశ్చర్యకరమైన అంశమే.ఎన్నికల మానిఫెస్టో అన్నది పార్టీలకు బైబిల్ , భగవద్గీత అని అంటారు.వాటిని దగ్గరబెట్టుకుని రాజకీయ పార్టీలు హామీలను తీర్చవలసి ఉంటుంది. కాని మరి సాంకేతిక సమస్య కారణంగా కనిపించడం లేదా??లేక నిజంగానే కావాలనే తీసేశారా అన్నది టిడిపి నేతలు చెప్పవలసి ఉంటుంది.రుణ మాపీ అంశంతో అనేక హామీలు నెరవేర్చడం అన్నది చాలా కష్టం అందువల్ల వాటిని కనిపించకుండా చేస్తే అడిగేవారు అడగకుండా ఉంటారా?నిజంగానే టిడిపి మానిఫెస్టో వెబ్ సైట్ లో తీసేసినా, రఘువీరా తో సహా విపక్ష నేతలందరి వద్ద ఆ పుస్తకాలు ఉండవా?

మరింత సమాచారం తెలుసుకోండి: