నరేంద్ర మోడీ సర్కారుకు ఓటరు చిన్న వార్నింగ్‌ ఇచ్చాడు. ఐదేళ్ళ పాటు ఇలానే కొనసాగితే ఆపై ఇక కొనసాగించలేమని ఓటు ద్వా రానే చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో జరి గిన ఉప ఎన్నికల్లో బిజెపి తీవ్ర పరాజయాన్ని ముటకట్టు కోవాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బిజెపికి నిరాశే మిగిలింది. తాజా పరిస్థితి కమలనాథులను కలవరపెడుతున్నది. అతి త్వర లో జరగనున్న హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఫ లితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళనలో బిజెపి నేతలు తీవ్రంగా తర్జన భర్జనలు పడుతున్నారు. అయితే దీనికి కా రణాలు ఏమిటో అన్వేషణలో ప్రధాన మంత్రి నరేంద్ర మో డీ, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలు నిమగ్నమై ఉ న్నారు. హర్యానాలో ప్రస్తుతం కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉండగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో ప్ర భుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమాలో నిన్నటి వరకు ఉన్న కమలనాథులు తాజా ఉపఎన్నికల ఫలితాలతో ఒక్కసారి గా కంగుతిన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దిద్దు బాటు చర్యలు చేపట్టాలని అమిత్‌షా, మోడీలు నిర్ణయిం చారు. అయితే 100 రోజుల మోడీ పాలన ప్రభావమేనా ఎందుకు ఓటరుకు మోడీపై అసంతృప్తి ఉందనేది అందరి ప్రశ్న. మోడీ అధికారంలోకి రాగానే నెలరోజుల్లో రైల్వే ఛా ర్జీలు పెంచటం, నిత్యవసర ధరలను నియంత్రిచలేకపోవ టం, బడ్జెట్‌ ఆశాజనకంగా లేకపోవటం ఇవన్నీ కారణాలుగా కనిపిస్తున్నారు. పదేళ్ళ యూపిఏ పాలనపై విసిగి వేశారిపోయిన దేశ ప్రజలు కొత్త ప్రధాని వస్తారు... ఏమైనా చేస్తారనే భారీ ఆశలు, అంచనాలతో ఉన్నారు. కానీ అవేమీ జరగకపోగా భారాలను నెత్తినపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది మోడీ సర్కారుకు చిన్న జలక్‌ ఇచ్చాడు ఓటరు అంతే.. రానున్న హర్యానా. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటరు ఇలాగే మరోజలక్‌ ఇస్తాడని కాంగ్రెస్‌తో పాటు ఎన్‌డియేతర పక్షాలు చెబుతున్నారు. ఉప ఎన్నికలు 33 అసెంబ్లీ స్థానాలకు జరిగితే బిజెపి కేవలం 12 స్థానాలను మాత్రమే గెలుపొందింది. ఉప ఎన్నికలు జరిగిన వాటిలో 24 స్థానాలు బిజెపివే అంటే దాదాపుగా 50శాతం నష్టపోయింది. బిజెపి అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో 4 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే ఏకంగా కాంగ్రెస్‌ 3స్ధానాలను కైవసం చేసుకుంది. అధికార బిజెపి మాత్రం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏకంగా 71 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న ఉత్తర ప్రదేశ్‌లో 11 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కేవలం 3 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ ఏకంగా 8 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా నష్టపోయిన సమాజ్‌వాదీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బిజెపికి వ్యతిరేకంగా చేసిన ప్రచారం ఫలించింది. అయితే తనను ప్రచారం చేయకుండా సమాజ్‌ వాదీ అడ్డుకుందని అందుకే బిజెపి ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీకి చెందిన ఎంపీ యెగి అధిత్యనాథ్‌ పేర్కొనటం విశేషం. అన్నింటికి 100 రోజుల పాలన.. డబ్బా కొట్టుకోవటం.. చేసింది ఏమీ లేకపోవటం... ధరలు పెంచి వాటిని యూపిఏ గతంలో చేసిందని ప్రచారం చేయటం. ఇవే ప్రధానమైన కారణాలుగా కనిపిస్తున్నాయి. మోడీ ఒక హిట్లర్‌లాగా వ్యవహరించారు. మంత్రులపై నిఘా పెట్టారు. పార్టీని, అధికారాన్ని ఒకే చేతిలోకి తీసుకుని మోడీ అంతా తానే వ్యవహరించటం వల్లే పార్టీలోని అంతర్గత శక్తులే ఈ తరహా ఓటమికి కారణమయ్యారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అఖరికి మోడీ సొంత రాష్టమ్రైన గుజరాత్‌తో సైతం పార్టీని అన్ని స్థానాల్లో గెలిపించుకోవటంలో ఎందుకు విఫలమయ్యారు. గుజరాత్‌లోని 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ 3 స్థానాలు ఎలా కైవసం చేసుకుంది. బిజెపి ఎందుకు 6 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక పశ్చిమ బెంగాల్‌ మాత్రమే ఒక సీటు గెలుపొంది బిజెపి అక్కడ ఖాతా తెరిచింది. మిగిలిన అన్ని చోట్లా బిజెపికి పరాజయం ఎదురైందనే చెప్పాలి. తాజా పరిస్థితిని సమీక్షించేందుకు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆలోచిస్తున్నట్లు సమాచారం. యూపిలో 71 ఎంపీ స్థానాలను గెలుపొందటంలో తీవ్రమైన కృషి చేసిన అమిత్‌షా... జాతీయాధ్యక్షుడి పదవి పొందిన తర్వాత తొలి షాక్‌ తగిలింది. అమిత్‌షా పై పార్టీలో ఏమైనా వ్యతిరేకత ఉందా... అది బయటపడటం లేదా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ప్రజల అంచానాలు మోడీపై ఎక్కువగా ఉండటం... వాటిని 100 రోజుల్లోనే చేరుకోలేకపోవటం... కనీసం 10శాతం కూడా అమలు కాకపోవటం వంటి కారణాలే బిజెపి పాలిట శాపంగా మారాయి. 2014 సాధారణ ఎన్నికల్లో 279 ఎంపీ స్థానాలు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు బిజెపిపై తీవ్రమైన అసంతృప్తితో ఉండటానికి గల కారణాలపై ఆ పార్టీ అత్యవసరంగా సమావేశమవుతున్నది. చైనా అధ్యక్షుడి గుజరాత్‌ పర్యటన తర్వాత మోడీ, అమిత్‌షాలు ఢిలీి్ల వచ్చి పార్టీ ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: