'స్వరాజ్యం మా జన్మహక్కు' అంటూ నినదిస్తున్న స్కాట్ లాండ్ భవితవ్యం తేలేది నేడే. 307 ఏళ్ల పాటు బ్రిటన్ తో కొనసాగిన అనుబంధం తెగుతుందా? లేదా? అని తేలేది నేడే. సుదీర్ఘకాలం ఒకే దేశంగా సాగిన బ్రిటన్, స్కాట్ లాండ్ దేశాలు విడిపోనున్నాయా? లేక ఎప్పట్లానే కలిసి ఉంటాయా? అన్న సందిగ్థత నేడు వీడిపోనుంది. బ్రిటన్, స్కాటిష్ బంధం నిలుస్తుందా? పతనమవుతుందా? అంటూ ప్రపంచం మొత్తం ఆసక్తితో ఉంది. ప్రపంచ చరిత్రలో మరో స్వాతంత్ర్య ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. ప్రజాస్వామ్య పద్దతిలో, ప్రజల అభీష్ఠానికి అనుగుణంగా స్కాట్ లాండ్ లో బ్రిటిష్ ప్రభుత్వం నేడు ఏక వాక్య రెఫరెండం నిర్వహించనుంది. దీంతో బ్రిటన్ పౌరుల కోరిక ఫలిస్తుందా? స్కాట్ లాండ్ ప్రజల మనోభావాలు నిలుస్తాయా? అనేది నేడే తేలిపోనుంది. దాదాపు 43 లక్షల మంది ప్రజలు కలిగిన స్కాట్ లాండ్ లో 16 ఏళ్లు దాటిన వారంతా ఈ రెఫరెండంలో పాల్గొంటున్నారు. వీరంతా 'ఎస్' లేదా 'నో' అని సమాధానం చెప్పి తమ భవిష్యత్ నిర్థేశించుకోనున్నారు. స్కాట్ లాండ్ ప్రజల నిర్ణయంపై యావత్ ప్రపంచం ఆసక్తి చూపుతోంది. ఈ నిర్ణయం స్కాటిష్ ప్రజల భవిష్యత్తే కాకుండా బ్రిటన్ భవితను కూడా తేల్చనుందని నిపుణులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: