ఎర్రచందనం అమ్మకాల వేలంపాటల నిర్వహణపై స్టే వచ్చింది. చెన్నైలోని గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఈ వేలంపాటలను నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చినట్లు సమాచారం. గ్రీన్‌ట్రైబ్యునల్‌ అన్నది పర్యా వరణ పరరిక్షణ కోసం ఉద్దేశించిన దని తెలిసింది. చె నై్న కేంద్రంగా ఈ ట్రైబ్యునల్‌ పనిచేస్తుంది. ఎక్కడైనా పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలుగుతున్నదని పిస్తే ఎవరైనా సరే ఈ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవ చ్చు. ప్రభుత్వం ఎర్రచందనం దుంగల అమ్మకాల కో సం వేలంపాటలు నిర్వహించి వచ్చిన డబ్బును రుణ మాఫీ హామీ నెరవేర్చటంలో ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. అందుకోసం ప్రభుత్వం చాలా పక డ్బందీగా వేలంపాటల కోసం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌ వేర్‌తో వెబ్‌సైట్‌నే రూపొందించింది. దీని ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఎర్రచందనం కొనుగోలుదారులు బిడ్డింగ్‌లో పాల్గొంటున్నారు.  ఇప్పటి వరకూ చైనా, దుబాయ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, జపాన్‌, మలేషియా తదితర దేశాల నుండే కాకుండా దేవీయంగా కూడా వందలాది మంది కొనుగోలుదారులు వేలంపాటల్లో పాల్గొనేందుకు చాలా ఆశక్తి చూపుతున్నారు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత జరుగుతున్న వేలంపాటలు కావటంతో పలువురు పెద్ద ఎత్తున బిడ్డింగ్‌లో పాల్గొంటున్నారు.వేలంపాటలను ఇప్పటికే అటవీశాఖ రెండు సార్లు వాయిదా వేసింది. రోజు రోజుకు ఈ వేలంపాటలపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆశక్తిని అవకాశంగా తీసుకోవాలని అటవీశాఖ వేలంపాటల్లో బిడ్లు దాఖలు చేయాల్సిన ఆఖరుతేదీని పొడిగించింది. సెప్టెంబర్‌ 19 నుండి 15వ తేదీలోగా బిడ్లు దాఖలు చేయాల్సిందిగా అటవీశాఖ మొదటి గడవు విధించింది. అయితే, అప్పటికి పూర్తి స్దాయిలో కొనుగోలు దారులకు ఈ సమాచారం చేరలేదన్న కారణంతో ఆఖరు తేదీని అక్టోబర్‌ 10-17 తేదీల దాకా వాయిదా వేసంది. అందులోనూ కొనుగోలు దారులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులు చైనా, జపాన్‌, మలేషియా, సింగపూర్‌ తదితర దేశాల్లో రోడ్డుషోలు కూడా నిర్వహించారు. దీని ఫలితంగా కొనుగోలు దారుల్లో మంచి స్పందన వస్తోందని కూడా ఉన్నతాధికారులుసంతోషిస్తున్నారు. అయితే, వేలంపాటలను నిలుపుదల చేస్తూ చెన్నైలో గ్రీన్‌ ట్రైబునల్‌ స్టేఇవ్వటంతో ఉన్నతాధికారుల ఉత్సహంపై నీళ్ళు చల్లినట్లైంది. వేలంపాటల నిర్వహణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో పలు లోపాలున్నాయంటూ ఒక కొనుగోలుదారు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సదరు ఫిర్యాదు ఆధారంగానే ట్రైబునల్‌ కూడా స్టే మంజూరు చేసింది. స్టే మంజూరుకు దారి తీసిన పూర్తి కారణాలు అధికారులకు కూడా ఇంకా తెలియలేదు. ఎర్రచందనం అమ్మకాల ద్వారా వచ్చే డబ్బును బ్యాంకుల్లో సెక్యూరిటీగా పెట్టాలని, ఐపిఐఐసి భూములను కూడా సెక్యూరిటీగా చూపించాలని, ఆబ్కారీశాఖ ద్వారా వచ్చే అంచనా ఆదాయంతో పాటు ఇసుక అమ్మకాల ద్వారా వస్తాయనుకుంటున్న ఆదాయాన్ని కూడా బ్యాంకుల్లో సెక్యూరిటీగా చూపాలని, ఫిస్కల్‌ రెస్పాన్స్‌బులిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌(ఎఫ్‌ఆర్‌బిఎం)రుణపరిమితిని పెంచుకోవటం, ప్రభుత్వం తరపున రైతులకు బాండ్లను జారీ చేసి సదరు బాండ్లను మళ్ళీ బ్యాంకుల్లో తనఖా పెట్టటం ద్వారా రుణాలు తీసుకుని రైతు, డ్వాక్రా, చేనేత, ఎస్సీ రుణమాఫీని అమలు చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే చంద్రబాబు ఏ ఆలోచన చేసినా ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. ఎర్రచందనం దుంగలను వేలం పాటలు వేయటం ద్వారా ప్రభుత్వానికి మహా వస్తే రూ. 1500 కోట్లకన్నా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. గడచిన కొద్ది సంవత్సరాలుగా అటవీశాఖ సిబ్బంది, పోలీసులు వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న ఎర్రచందనం దుంగలను తీసుకువచ్చి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా నిల్వ చేశారు. అంటే అటవీశాఖ పరిధిలో అయినా, పోలీసు పరిధిలో అయినా ఆరుబయటే దుంగలను పడేసారు. దాంతో ఆ చెట్లు, దుంగలన్నీ ఎండకు ఎండిపోయి, వానకు తడిసిపోయి చాలా చోట్ల చెదలు పట్టేసినట్లు సమాచారం. పట్టుబడిన ఎర్రచందనం మొత్తం అత్యుత్తమ నాణ్యత కలిగినదనటంలో ఎటువంటి సందేహం లేదు.అటవీశాఖలో దొరికే ఎర్రచందనం అత్యుత్తమ నాణ్యత కలిగినది కాబట్టే దేశ, విదేశాల్లోని పలువురు కొనుగోలుపై పెద్ద ఎత్తున ఆశక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలువురు చెట్లు, దుంగలను నిల్వ ఉంచిన గోదాముల్లో సరుకును కూడా ప్రత్యక్షంగా చూసుకున్నారు కూడా. అయితే, సంత్సరాల తరబడి అత్యధికాన్ని నిల్వ చేయటంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల నాణ్యత దెబ్బతిన్నట్లు సమాచారం. దాంతో ఎర్రచందనం వేలంపాటల ద్వారా ప్రభుత్వం అంచనా వేసుకుంటున్న ఆరువేల కోట్ల రూపాయలు వస్తాయా అన్నది ఇప్పటికైతే ప్రశ్నార్ధకమే.

మరింత సమాచారం తెలుసుకోండి: