ముఖ్యమంత్రి సాధించింది ఏమీ లేకున్నా ప్రపంచస్థాయి అభివృద్ధి అంటూ ప్రతి రోజూ మాట్లాడుతున్నారని, ప్రపంచస్థాయి ముఖ్యమంత్రి కనీసం బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేకపోయారని బిజెపి సీనియర్ నేత నాగం జనార్దనరెడ్డి అన్నారు. పరిపాలన సున్నా, సిఎం ఆత్మవిశ్వాసం మాత్రం సంపూర్ణం (జీరో గవర్నెన్స్-కాన్ఫిడెన్స్ ఫుల్) అని అన్నారు. పరిశ్రమలకు సింగిల్ విండో అంటున్నారని, అదేమిటో చెప్పడం లేదని, జీరో కరప్షన్ అంటూ ప్రతి రోజూ సిఎం మాట్లాడుతున్నారని, వీధుల్లోకి వస్తే అవినీతి ఎంత విశృంఖలంగా ఉందో అర్ధం అవుతుందని నాగం అన్నారు. సమర్ధులైన అధికారులు ఉన్నా వారి సేవలను ఉపయోగించుకోలేక పోతున్నారని అన్నారు. సిఎం ఆఫీసులో వేలాది ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, తొలి క్యాబినెట్ ఫైళ్లు కూడా సిఎం ఆఫీసులో పెండింగ్‌లో ఉన్నాయని అదేనా బంగారు తెలంగాణా అని నాగం ప్రశ్నించారు. పార్టుటైమ్ ఉద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదని, స్థానికతపైనా, విద్యుత్ అంశంపైనా, జలాలపైనా వివాదాస్పద వ్యాఖ్యలతో పథకం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి ఒక్క ప్రాజెక్టు గురించి కూడా సమీక్షించలేదని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: