"మేమూ భారతీయులమే.. మా వైపు అనుమానపు చూడవద్దు.. ..'' అని అంటారు భారత్ లోని సగటు ముస్లిం లు. ముస్లింలు అంటే ఉగ్రవాదులు అనే భావన వద్దని... తామూ భారతీయులమేనని, దేశభక్తి ఉందని, తాము ఈ దేశానికి ద్రోహం చేసే వాళ్లం కాదని, ఇక్కడే పుట్టామని ఈ నేల తమిది కూడానని వారు అంటారు. అయితే ఇదే సమయంలో పాక్ ప్రేరిపిత ఉగ్రవాదంలో భారతీయ ముస్లింలు భాగస్వామ్యులు అవుతున్నారు. అనేకమంది ఉగ్రబాట పడుతున్నారు. దీంతో చిక్కొచ్చిపడుతోంది. మతమౌడ్యాన్ని నింపి అనేక మంది యువకులను ఉగ్రవాద బాట పట్టిస్తున్న దుష్ట సంస్థల కోరలు ఎప్పుడో భారత్ పై పడ్డాయి. ఇప్పుడు అవి మరింత తీవ్రం కానున్నాయట. ఆల్ కాయిదా కూడా భారత్ పై దృష్టి సారించినట్టు ప్రకటించుకొంది. ఒకవైపు ఇరాక్ లో జరుగుతున్న మతరాజ్య స్థాపనపై కూడా భారతీయ ముస్లిం యువకులు దృష్టి సారించారని తెలుస్తోంది. కరీంనగర్ నుంచి కూడా అనేక మంది ముస్లిం యువకులు వెళ్లి ఇరాక్ మారణ హోమంలో పాలు పంచుకొంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఉగ్రవాద పోరాటంలోని మతయుద్దానికి భారతీయులు కూడా ఆయుధాలుగా మారుతున్నాయని అనుకోవాల్సి వస్తోంది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముస్లింల మీద నమ్మకాన్ని చూపిస్తున్నాడు. వారు ఆల్ కాయిదా చేతిలో అస్త్రాలు అవుతారని తను అనుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించాడు. సీఎన్ ఎన్ ఐబీఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ఈ వ్యాఖ్యానాలు చేశాడు. తను మత, మనస్తత్వ విశ్లేషకుడిని కానంటూనే... భారతీయ ముస్లింలు ఆల్ కాయిదా జోలికి వెళ్లరనే తను భావిస్తున్నానని మోడీ అన్నాడు. ముస్లింలు భారతదేశం కోసం ప్రాణమిస్తారని మోడీ వ్యాఖ్యానించాడు. దేశంలో ఆల్ కాయిదా ఆటలు సాగవని.. వారితో భారతీయ ముస్లింలు జత కలిసే అవకాశం లేదని మోడీ అభిప్రాయపడ్డాడు. మరి ఈ మాటతో మోడీ భారతీయ ముస్లింల మనసు గెలిచినట్లేనా..?!

మరింత సమాచారం తెలుసుకోండి: