ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పేరును తప్పు గా పలికిన దూరదర్శన్ న్యూస్ రీడర్ పై వే పడింది. జిన్ పింగ్(XI) పేరును పదకొండవ జిన్ పింగ్ అని పలకడమే ఆ మహిళా న్యూస్ రీడర్ చేసిన పొరపాటు. మరి ఇది ఆయనకు జరిగిన అవమానంగా భావించిన ప్రభుత్వ చానల్ వారు ఆ న్యూస్ యాంకర్ ను విధుల నుంచి తప్పిస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ఈ పొరపాటు ఆ న్యూస్ యాంకర్ ది మాత్రమేనా.. లేక న్యూస్ స్క్రిప్ట్ రైటర్ చేసిన పొరపాటా.. అనేది అంతర్గత విచారణలో తేలిందో ఏమో కానీ, చర్యలు మాత్రం న్యూస్ రీడర్ మీదే తీసుకొన్నట్టు దూరదర్శన్ ఒక ప్రకటన చేసింది. మరి చైనా వాళ్ల పేర్లు పలకడమే భారతీయులకు చాలా కష్టమైన పని. ఇలాంటి సమయంలో ఒకవేళ ఉచ్ఛారణ లోపం అయితే ఆమెది తప్పేమీ కాదనుకోవచ్చు. కానీ పదకొండవ జిన్ పింగ్ అని వ్యాఖ్యానించడం మాత్రం తప్పయ్యింది. ప్రభుత్వ అధికారక చానల్ కాబట్టి చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి. అదే ప్రైవేట్ చానల్స్ అయితే అది పెద్ద ఫాల్ట్ అయ్యేది. ఈ విషయంలో ఎక్కడ చైనా నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతుందో అనే భయంలో డీడీ వాళ్లు చాలా త్వరగా చర్యలు తీసుకొన్నట్టుగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: