ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులకు క్లాస్ పీకారు.డ్వాక్రా బృందాలు, అధికారులతో అక్టోబర్ రెండు నుంచి చేపడుతున్న కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది.ముఖ్యమంత్రి ముందుగా మాట్లాడి , తర్వాత మంత్రులు, అధికారులు ఆయా అంశాలపై సంభాషించారు. అయితే మంత్రులు అదికారులకు అవకాశం ఇవ్వకుండా వారే మాట్లాడుతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇకపై అధికారులతో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లలో మంత్రులు పాల్గొననవసరం లేదని ఆయన అన్నట్లు కధనాలు వచ్చాయి. మంత్రులు పల్లె రఘునాధరెడ్డి,రావెళ కిషోర్ బాబులు లు ఎక్కువ సమయం తీసుకుని మాట్లాడుతున్న సమయంలో వారించే ప్రయత్నం జరిగిందని అంటున్నారు.తాను అధికారులు, ప్రజలతో నేరుగా మాట్లాడాలనుకుంటున్నానని ఆయన అన్నారు. అయితే అదే సమయంలో శాఖాపరంగా ఏవైనా అవకతవకలు జరిగితే మంత్రులను ఆయన హెచ్చరించారని కూడా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: