తెలుగుదేశం పార్టీని గతమహానాడులో జాతీయ పార్టీగా ప్రకటించారు. గతంలోకూడా ఇలాంటి ప్రయత్నాలు కొన్ని జరిగాయి. పార్టీ పేరును భారతదేశం పార్టీగా కూడా పెట్టాలన్న ఆలోచన వ్యక్తం అయ్యింది. కానీ ఇది ఏనాడూ నిర్ధిష్ట రూపాన్ని సంతరించుకోలేదు. ఆమాటకోస్తే తెలుగుదేశం నాయకత్వం కూడా ఈ దిశగా సీరియస్ ప్రయత్నాలేవీ చేయలేదు. అకస్మాత్తుగా రాష్ట్ర విభజన నేపద్యంలో టిడిపిని ఆదరాబాదరాగా జాతీయ పార్టీగా ప్రకటించారు. ప్రకటనైతే జరిగింది కానీ ప్రయత్నాలేవీ లేవు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మినహా ఇతర రాష్ట్రాలలో ఎక్కడా కూడా టిడిపీ శాఖలు ఏర్పాటు కాలేదు. ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. మరి ఎందుకని మహానాడులో జాతీయ పార్టీగా నామకరణం చేసారు. రాష్ట్ర విభజన నేపద్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు వస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ హోదాను ఆ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం ఆయన భాద్యత అదే సమయంలో అనుకున్న దానికన్నా తెలంగాణాలో ఎక్కవ సీట్లు రావడంతో ఇక్కడ ఆశలు సజీవంగా వున్నాయి. ఇక్కడ టిఆర్ ఎస్ అధికారంలోకి రావడంతో టిడిపి పై ఆంధ్రాపార్టీ అంటూ దాడి జరుగుతోంది. చంద్రబాబు నాయుడును ఆంధ్రానాయకుడంటూ టిఆర్ ఎస్ విమర్శిస్తోంది. ఇందుకు సమాధానమే జాతీయ పార్టీ అవతారం. చంద్రబాబు నాయుడుకు జాతీయ రాజకీయాల్లో గుర్తింపు వున్న మాట నిజమే అధికారంలో వున్న సమయంలోనే యునైటెడ్ ప్రంట్ కు కన్వీనర్ గా వ్యవహరించారు. యన్ టి రామారావు. నేషనల్ ప్రంటుకు నాయకత్వం వహించారు. అయితే జాతీయ పార్టీగా రూపొందడానికి ఇవి మాత్రమే సరిపోవు. జయలలిత పార్టీలో ఆలిండియా అన్న పేరున్నా కూడా జాతీయ ప్రభావం ఏమీ లేదు. తెలుగు దేశం కూడా పార్టీకి జాతీయ వైభవం తెస్తుందన్న సూచనలేవీ లేవు. తక్షణ రాజకీయ దాడిని తట్టుకునేందుకే ఈ జాతీయ పార్టీ ప్రకటన.

మరింత సమాచారం తెలుసుకోండి: