ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే వారం 'మేక్‌ ఇన్‌ ఇండియా' క్యాంపెయిన్‌ను ప్రారంభించనున్నారని సమా చారం. ఈ నినాదంలో భాగంగా తయారీ రంగంలో 10 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా నిర్దేశించనున్నారని అధికార వర్గాలు పేర్కొం టున్నాయి. ప్రస్తుతం భారత్‌లో పెట్టుబడులపై అననుకూల (అన్‌ఫ్రెండ్లీ) అపవాదు ఉందని, ఈ ఆలోచన ను మార్చడానికి ఈ క్యాంపెయిన్‌ దోహదం చేయనుందని పారిశ్రామిక విధానం మరియు ప్రోత్సాహక శాఖ (డిఐపిపి) ఉన్నతా ధికారి ఒక్కరు పేర్కొన్నారు. 30 దేశాలకు చెందిన 10 రంగాల్లోని 3,000 కంపెనీలను ఇప్పటికే గుర్తించామని చెప్పారు. ఈ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయ త్నం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ క్యాంపెయిన్‌ నిర్వహించనుందని తెలిపారు. ఈ రంగాల్లో ఆటోమొబైల్‌, ఫార్మాస్యూటికల్‌, ఫుడ్‌ ప్రాసె సింగ్‌, ఐటి, ఎలక్ట్రానిక్స్‌, టెక్స్‌లైట్‌ కంపెనీ లున్నాయని పేర్కొన్నారు. ఈ క్యాంపెయిన్‌ సెప్టెంబర్‌ 25న మోడీ ప్రారంభించే అవకాశాలున్నాయన్నారు. జపనీస్‌, కొరియన్‌ తదితర పెద్ద దేశాలకు చెందిన వివిధ కంపెనీల సిఇఒలు ఇందులో పాల్గొనే అవకాశాలున్నాయని ఆ అధికారి పేర్కొ న్నారు. విదేశీ కంపెనీల పెట్టుబడులను ప్రొత్స హించడానికి ప్రభుత్వం కొన్ని లైసెన్స్‌ విధానా లను సడలించే అవకాశం ఉందన్నారు. దీంతో తయారీ రంగంలో 10 శాతం వృద్ధి రేటును పెంచాలని ప్రభుత్వం నిర్దేశించు కుందన్నారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడానికి తయారీరంగంమినహాఇంకోమార్గం లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: