మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా వంద రోజుల ముచ్చటను కూడా సరిగా జరపుకొన్నట్టు లేదు కానీ... అప్పుడే ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసే స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కోర్టులో పిటిషన్ కూడా పడటం విశేషం. ఇక్కడ ప్రభుత్వ పాలన రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ తాజాగా హై కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఇక్కడ ముఖ్యమంత్రి రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించడం లేదని... ప్రమాణ స్వీకారం చేసినట్టుగా వ్యవహరించడం లేదని దీంతో ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలనను విధించడమే ప్రత్యామ్నాయమని పిటిషన్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో వ్యవహరించడం దగ్గర నుంచి అనేక విషయాలను ప్రస్తావిస్తూ పిటిషన్ దారులు రాష్ట్రపతి పాలనను కోరుతున్నారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలనను కోరుతున్నది కూడా హైదరాబాదీలే. తెలంగాణ ప్రజలే. వారే ఈ మేరకు పిటిషన్ వేశారు.. మరి ఇంత త్వరగా రాష్ట్రపతి పాలన కోసం డిమాండ్ వినిపించడం, కోర్టులో పిటిషన్ పడటం విశేషమే అనుకోవాల్సి వస్తోంది. ఇది కేసీఆర్ పాలనపై బ్యాడ్ రిమార్కే అని చెప్పవచ్చు. మరి ఈ పిటిషన్ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో..అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోకపోవచ్చని కేసీఆర్ పాలనకు ఇప్పుడొచ్చిన ప్రమాదం ఏమీ లేదనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇంత త్వరగా రాష్ట్రపతి పాలనకు డిమాండ్ వినిపించడం మాత్రం ఒకింత విడ్డూరమే!

మరింత సమాచారం తెలుసుకోండి: