ఏదైనా విషయాన్ని రాజకీయంగా అనుకూలంగా మలచుకోవడానికి అనుభవం కావాలి. అది కొరవడటం వల్లనో ఏమో కానీ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ కొన్న తప్పుటడుగులు వేస్తున్నారు. వారెవా.. భలే ఛాన్సని ఓ అంశాన్ని పట్టుకుని రాజకీయం చేద్దామనుకుంటే అది కాస్తా బూమరాంగవుతోంది. తాజాగా అశ్వారావుపేట ఎమ్మెల్యేపై దాడి ఇష్యూ కూడా ఇలాగే అయ్యింది. టీడీపీ నేతల దాష్టీకాన్ని ఎండగట్టడానికి భలే ఇష్యూ దొరికిందని ఆయన చంకలు గుద్దుకుంటే.. అది కాస్తా యాంటీ ఆంధ్రా ఇష్యూగా మారి పార్టీ ప్రతిష్టను ఇంకా మసకబారుస్తోంది. ఖమ్మం జిల్లా నుంచి పశ్చిమగోదావరిలో కలిసిన కుక్కునూరులో జరిగిన ముంపు ప్రాంతాల సమీక్షా సమావేశంలో ఆంధ్రా-తెలంగాణ నినాదాలు మారుమోగాయి. అశ్వరావుపేటఎమ్మెల్యే వెంకటేశ్వర్లు.. టీడీపీ ఎంపీ మాగంటి బాబును ఉద్దేశించి ఆంధ్రా ఎంపీ గో బ్యాక్ జై తెలంగాణ నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. ఇరువర్గాల తోపులాటలతో పరిస్థితి ఉద్రిక్తమైంది. వెంకటేశ్వర్లు కాస్త అనారోగ్యంపాలయ్యారు. దీన్ని పొలిటికల్ గా యూజ్ చేసుకుందామని భావించిన జగన్.. తెలంగాణ నేతలను స్పీకర్ కు ఫిర్యాదు చేయించారు. టీడీపీ గూండాయిజాన్ని ఎస్టాబ్లిష్ చేద్దామని ప్రయత్నించారు. కానీ ఈ ఇష్యూ మూలాల్లోకి వెళ్తే.. ఆ సమావేశం పోలవరం ప్రాజెక్టు గురించి జరిగింది. దాన్ని అశ్వరావుపేట ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారు. మరి ఆయన వాదాన్ని వైఎస్సార్ సీపీ సపోర్టు చేసి పోలవరాన్ని వ్యతిరేకించినట్టు జనంలోకి సంకేతాలు వెళ్తాయి కదా.. అసలు ఈ ముంపు ప్రాంతాల గురించి.. సాక్షాత్తూ తెలంగాణ సీఎమ్మే ఆశలు వదిలేసుకున్నారు. అలాంటప్పుడు.. ఈ ఇష్యూ ద్వారా రాజకీయ లబ్ది పొందే ఉద్దేశంతో వెంకటేశ్వర్లును వెనకేసుకొస్తే.. అది కాస్త యాంటీ ఆంధ్రా ఇష్యూగా మారి.. నెగిటివ్ పబ్లిసిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జగన్ కు క్లారిటీ లేకనే తప్పటడుగు వేసేరా.. వేరే ఇంకా ఏమైనా వ్యూహం ఉందా అన్నది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: