తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని విరసం నేత వరవరవరావు, మానవహక్కుల ఉద్యమనేత హరగోపాల్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచేయాలని ఆయన చూస్తున్నారన్నారు. ప్రజాసంఘాల నేతల అరెస్టును తాము తీవ్రస్థాయిలో ఖండిస్తున్నట్లు చెప్పారు. అర్ధరాత్రి సమయంలో ఉద్యమనాయకులను అరెస్టు చేసి.. ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న కార్యక్రమాలను అడ్డుకోవడం తగదన్నారు. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి వైఖరినే అవలంబిస్తే మాత్రం తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కాళోజీ, జయశంకర్ లాంటి వాళ్లు ఎవరూ ఇలాంటి నిర్బంధాలతో కూడిన తెలంగాణను కోరుకోలేదని, ఈ విషయంలో కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవాలని వరవరరావు, హరగోపాల్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: