తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరబోయే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఐదు అని తెలుస్తోంది. ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలుపుకొంటే ఈ నంబర్ ను చెప్పవచ్చని తెలుస్తోంది. ఎర్రబెల్లి మాత్రమే గాక... మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారని సమాచారం. వీరిలో తీగల కృష్ణారెడ్డి. ధర్మారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరు గాక హైదరాబాద్ పరిధిలోని మరో నియోజకవర్గపు ఎమ్మెల్యే కూడా తెలుగుదేశాన్ని వీడి టీఆర్ఎస్ లో కి చేరనున్నట్టు తెలుస్తోంది! మరి ఈ ఐదు మంది ఎమ్మెల్యేలు గనుక ఇప్పుడు టీడీపీని వీడితో అది పచ్చ పార్టీకి పెద్ద దెబ్బే అవుతుంది. వీరు గనుక బయటకు వెళ్లిపోతే టీడీపీ బలం సగానికి సగం తగ్గినట్టు అవుతోంది. ఇప్పటికే తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డిలు టీఆర్ఎస్ అధ్యక్షుడితో సమావేశం అయి వచ్చారట. ఇక తలసాని టీడీపీలో చేరనున్నాడనే వార్త పాతదే! మరో ఐదేళ్ల వరకూ వేచి చూసే ఓపిక లేదు. కనీసం అప్పుడైనా అధికారం చేతికందుతుందనే నమ్మకం లేదు. దీంతో టీడీపీ నేతలు టీఆర్ఎస్ వైపు చేరుకోవడం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకి ప్రస్తుతానికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. కాంగ్రెస్ ఆ హోదాలో ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ కొంచెం గట్టిగా ఉంది. మిగతా ప్రాంతాన్ని టీఆర్ఎస్ , కాంగ్రెస్ లు ఆక్రమించి ఉన్నాయి. ఐదేళ్ల తర్వాత ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అవుతుంది కానీ... టీడీపీ కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇక తెలుగుదేశంలో ఉండి కష్టపడే ఓపిక ఈనేతలకు లేనట్టుంది. తమకు తగిన ప్రాధాన్యత దక్కే అవకాశాలను చూసుకొని వీరు జంపింగులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి!

మరింత సమాచారం తెలుసుకోండి: