సమైక్య పాలనలో అణచివేతకు గురైన తెలం గాణ సంసృ్కతి పునరుజ్జీవనానికి బతుకమ్మ పండుగ నాంది కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆకాక్షించారు. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను సాంసృ్కతిక పునరుజ్జీవ న వేడుకగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ సచివాలయం మహిళా ఉ ద్యోగుల సమాఖ్య రూపొందించిన కోటి బతుకమ్మల జాతర పోస్టర్‌ను ముఖ్యమంత్రి మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం బతుకమ్మ ఉత్సవ నిర్వహణపై సీఎం సమీక్ష నిర్వహి ంచారు. సమైక్య పాలనలో తెలంగాణ పండుగలు కూడా నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. ప్రభుత్వ సెలవుల్లో కూడా వివక్ష తప్పులేదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తె లంగాణలో పండుగలకు సెలవులు ఇచ్చే విధంగా ఎడ్యుకేషన్‌ క్యాలండర్‌ ఈయర్‌ రూపొందించాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బతుకమ్మ, దసరా పం డుగలను కలుపుకొని ప్రతి ఏడాది 15 రోజులు సెలవులు ఇవ్వాలని, సంక్రాంతి సెలవుల ను కుదించాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల న్నీ ఈ సెలవులను ఖచ్చితంగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బతుకమ్మ పండుగ ఓ కులానికి ఓ మతానికో సంబంధించిన ఉత్సవం కాదన్నారు. ఇది తెలంగాణ స మాజమంతా కలిసి జరుపుకునే వేడుక సీఎం అన్నారు. అనేక ప్రత్యేకతలు, అదిత్వీయ ల క్షణాలు వున్న బతుకమ్మ పండుగ కోసం ఖర్చుకు వెనుకానకుండా అధికారులు అన్ని ఏ ర్పాట్లు చేయాలని అన్నారు. తెలంగాణలో అన్ని పండుగలను సామూహికంగానే నిర్వహిం చకుంటారని అన్నారు. ఇది తెలంగాణ ప్రజల సామాజిక చైతన్యానికి నిదర్శమన్నారు. దస రా పండుగ రోజు పాలపిట్టను చూడడానికి వెళ్ళినా, జమ్మి చెట్టు వద్దకు పూజలు చేయడా నికి పోయినా, పీర్ల పండుగ జరుపుకున్నా, వన భోజనాలకు వెళ్లినా ఊరంతా కలిసే చేసు కుంటారని సీఎం చెప్పారు. బతుకమ్మ పాటల్లో కూడా దేవతలను కొలవడం దగ్గర నుంచి కుటుంబ బాంధవ్యాల వరకు అన్ని అంశాలు ఉంటాయన్నారు. పురాణ వ్యక్తులు, చారిత్రక పురుషులు, వీర గాధలు, కుటుంబం, బంధుత్వాలు, సంబంధాలు, త్యాగం, ప్రేమలాంటి వన్నీ బతుకమ్మ పాటల్లో కనిపిస్తాయని అన్నారు. నిర్లక్ష్రాస్యులు కూడా బతుకమ్మ పాటల ను రాగయుక్తంగా పాడుతారంటే వారి జీవితాల్లో బతుకమ్మ ఎలా భాగమయ్యిందో అర్థం చేసుకోవచ్చన్నారు. అందుకే బతుకమ్మ పండుగను తెలంగాణ సాంసృ్కతిక పునరుజ్జీవన సాధనకు ఓ ప్రేరణగా చూడాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీ వ్‌శర్మ, సిఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, ప్రభుత్వ సలహాదారు కెవి.రమణాచారి, ఎం పి. వినోద్‌కుమార్‌, వ్యవసాయశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య, సిఎంఓ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికార బతుకమ్మ నిర్వహణకు ప్రభుత్వం ప్రకటించిన నిధులను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ని తెలంగాణ సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం కోరింది. సోమవారం సాయంత్రం కేసీఆర్‌ను మహిళా ఉద్యోగులు కలిశారు. మహిళా సాధికార బతుకమ్మపై జిల్లాల వ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు రూపొందించిన కార్యక్రమాల వివరాలను తన కార్యాలయంలో ఇవ్వాలని, నిధులు వెంటనే విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కాగా, ఈ నెల 24, 27, 30 తేదీల్లో బతుకమ్మ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సచివాలయ టీఎన్‌జీవో మహిళా నేతలు ప్రకటించారు. అక్టోబర్‌ రెండోతేదీన సచివాలయం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు ర్యాలీగా వెళ్లి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ప్రతి రోజు బతుకమ్మ ఆడతాం. కానీ ఈ మూడు రోజుల్లో ప్రత్యేక అతిథులను ఆహ్వానించి ఘనంగా నిర్వహిస్తాం. ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణ మహిళా ఉద్యోగులను బతుకమ్మకు మధ్యాహ్నం 2 గంటల నుంచి అనుమతించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని తెలిపారు. కాగా, మీడియా పాయింట్‌లో టీజీవో రూపొందించిన బతుకమ్మ ఉత్సవాల పోస్టర్‌ని ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ ఆవిష్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: