ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువత కు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిని 34 నుంచి 40ఏళ్ళకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ, ఇతర ప్రత్యక్ష నియామకాలకు ఇప్పటి వరకు జన రల్‌ కేటగిరీలో 34 ఏళ్ళవరకు గరిష్ట వయోపరిమితిగా ఉంది. రాష్ట్ర విభ జన ఉద్యమాలతో గత రెండేళ్ళుగా ఏపీపీఎస్సీ, ఇతర ఉద్యోగ నియా మకాలు జరగలేదు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పిస్తూ మంగళవారం ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఆరేళ్ళ వయోపరిమితి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 2016 అక్టోబర్‌ 30వరకు జరిగే నియామక పరీక్షలకు వర్తిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు తెలిపారు. యూనిఫాం ధరించే పోలీసు, ఎక్సైజ్‌, అగ్నిమాపక దళాలు, జైళ్ళు, అటవీశాఖల నియామకాలకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదని ఆయన తెలిపారు. ఈ శాఖల్లో దేహదారుఢ్య ప్రమాణాలు పాటించాల్సి ఉన్నందున వర్తింపు లేనట్లు ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: