అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంధ్రమోడికి స్వాగత సత్కారాలే కాదు నిరసనల సెగలు కూడా తాకుతున్నాయి. ఆదివారం మెడిసన్‌ స్క్వేర్‌ లో మోడి ప్రసంగిస్తున్న సమయంలోనే దాని బయట నిరసన ప్రదర్శనలు సాగాయి. పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు ఈ ప్రదర్శనల్లో పాల్గోన్నారు. మోడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. మెడిసన్‌ స్క్వేర్‌లో మోడి ప్రసంగాన్ని ఆకాశానికెత్తిన కార్పొరేట్‌ మీడియా ఈ నిరసన ప్రదర్శనలను మాత్రం పట్టించుకోలేదు. కార్పొరేట్‌ మీడియా స్పందన ఎలా ఉన్నప్పటికీ ప్రధాని పర్యటన కొనసా గినన్ని రోజులు తమ నిరసనను కొనసాగించాలని ఆందోళన కారులు నిర్ణయించారు. అమెరికా అధ్య క్షుడు ఓబామాతో మోడి సమయం లో వైట్‌హౌస్‌కు సమీ పంలోనే ప్రజా కోర్టును కూడా నిర్వహిం చడానికి వీరు నిర్ణయించారు. ప్రజాకోర్టు నిర్వహ ణకు అమెరికా ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చినట్లు సమాచారం. 'అలయెన్స్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ అక్కౌంటబులిటి' పేరుతో ఒక్క గొడుగుకిందకు చేరిన అమెరికాలోని భారతీయులు ఈ నిరసన ప్రదర్శ నలను నిర్వహిస్తున్నారు. గుజరాత్‌ మారణహోమాన్ని వీరు ప్రస్తావిస్తున్నారు. సిక్కులకు చెందిన మానవహక్కుల సంస్థ (ఎస్‌ఎఫ్‌జె)తో పాటు పలు ఇతర మానవహక్కుల సంఘాలు కూడా ఈ నిరసన ప్రదర్శనల్లో భాగస్వాములయ్యాయి. మోడితో చర్చలకు అమెరికా అధ్యక్షుడు సిద్దపడటాన్ని ఈ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. చర్చలు జరిగే 30వ తేదిన వైట్‌హౌస్‌కు సమీపంలోని లఫెయత్లీ పార్కు వద్ద ప్రజాకోర్టును నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎఫ్‌జె తెలిపింది. దీనికి సంబంధించి ఛార్జిషీటును కూడా సిద్దం చేశామని వివరించింది. తాము నిర్వహిస్తున్న ప్రజాకోర్టు అమెరికా అంతా టెలీకాస్ట్‌ అవుతుందని ఆ సంస్థ తెలిపింది. ప్రజాకోర్టుకు ఇప్పటికే అనుమతి ఇవ్వడంతో అది సజావుగాసాగే అవకాశం ఉందని, అయితే, వైట్‌హౌస్‌ బయట నిరసన ప్రదర్శనలను మాత్రం అడ్డుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిక్కులకు చెందిన మానవ హక్కుల సంస్థ (ఎస్‌ఎఫ్‌జె) ఈ సందర్భంగా మోడీకి ఒబామా ఘనస్వాగతం ఇవ్వడం సెప్టెంబరు 30న చర్చలకు సిద్ధం కావడాన్ని ఆక్షేపించింది. మోడీని దోషిగా నిలబెట్టాలని సూచించింది. సెప్టెంబరు 30న లఫెయెత్లె పార్కు వద్ద వైట్‌హౌస్‌ బయట పౌర న్యాయస్థానం నిర్వహించి మోడీని దోషిగా నిలబెట్టడమవుతుందని ఈ కార్యక్రమం యథాత ధంగా అమెరికా అంతా టెలికాస్ట్‌ అవుతుందని ఆ సంస్థ పేర్కొంది. ఈమేరకు ఛార్జిషీటు కాపీ, పౌరన్యాయస్థానం (సిటిజెన్‌ కోర్టు ) అంశాలు మోడీకి భారత రాయబారి ద్వారా అందజేశారు. దీని వల్ల చట్టపరమైన చర్యలు మోడీపై ఉండక పోవచ్చు కానీ చాలా ఇబ్బందికర వాతావరణం మాత్రం ఏర్పడుతుందని ఎస్‌ఎఫ్‌జె పేర్కొంది. వైట్‌హౌస్‌లో ఒబామాతో మోడీ భేటీ సందర్భంగా బయట నిరసనలు ఎవరికీ తెలియకుండా ఒబామా అడ్డుకోవచ్చు. కానీ ప్రజాకోర్టు నిర్వహణకు లభించిన అనుమతిని వారు రద్దు చేయక పోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భిన్నత్వంలో ఏక త్వంలా సాగే భారతీయ సాంప్రదాయానికి భిన్నమైన సంస్కృతిని రుద్దుతున్న మోడి పార్టీని, సిద్దాంతాల ఎజెండాను తోసిపుచ్చడమే తమ లక్ష్యమని ఆందోళన కారులు ప్రకటించారు. గుజరాత్‌ నరమేధ బాధితులకు న్యాయం జరగక పోవడా నికి వ్యతిరేకంగా నిరసన తెలియ చేస్తున్నట్టు చెప్పారు. భారతీయ సెక్యులరిజంను, భిన్నత్వాన్ని విధ్వంసం చేయడానికి తాము అవకాశం ఇవ్వబో మని 52 ఏళ్ల న్యూరాలజిస్టు డాక్టరు షేక్‌ యుబెయి దా చెప్పారు. అలియన్స్‌ ఫర్‌ జస్టిస్‌, అండ్‌ అకౌంటబిలిటీ సంస్థలో భాగస్వామిగా ఆయన ఉంటున్నారు. మోడీని ఎవరు సత్కరిస్తున్నారో వారు భారత అమెరికా సంతతి సమాజం మొత్తానికి ప్రాతినిధ్యం వహించడం లేదని అందరికీ తెలుసునని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: