ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగాల్లో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ పైచేయి సాధించారని ఆ దేశ పత్రిక డైలీ టైమ్స్ వ్యాఖ్యానించింది. మోదీ ప్రసంగంలోని ఆకర్షణీయ అంశాలేవీ షరీఫ్ ప్రసంగంలో లేవని పేర్కొంది. ‘మోదీ భారత ఆధ్యాత్మిక, వేద సంస్కతి, అక్కడి ప్రజలు, ప్రపంచ మార్కెట్ తదితర అంశాలను మాత్రమే లేవనెత్తారని తెలిపింది. అయితే పాక్ ప్రధాని షరీఫ్ ప్రసంగం మాత్రం సంకుచితంగా సాగడమే కాకుండా.. పాకిస్తాన్ లో ఏదో తప్పుజరిగినట్లు పాశ్చాత్యులు భావించేలా ఉందని' డైలీ టైమ్స్ పేర్కొంది. నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పాకిస్తాన్ పై పెద్దగా దృష్టి పెట్టకపోవడం కూడా భారత్ ఛరిష్మాను అమాంతం పెంచేసిందని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మోదీ .. భారత దేశ అభ్యున్నతికి సంబంధించిన అంశాలు అందర్నీ ఆకట్టుకున్నాయని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: