తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకొన్నప్పుడు కోటి రూపాయలు ఇచ్చారు.. తర్వాత మరో మిక్సడ్ డబుల్ టైటిల్ ను సాధించినప్పుడు ఇంకో కోటి రూపాయాలు ఇచ్చారు. మరి ఇప్పుడు సానియా ఏషియన్ గేమ్స్ లో ఒక స్వర్ణపతకం సాధించింది... మరో పతకాన్ని ఖాయం చేసుకొంది. మరి ఈ సారి తెలంగాణ ముఖ్యమంత్రి ఆమెకు ఎలాంటి బహుమానాన్ని ప్రకటిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది! కేసీఆర్ సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినప్పుడే విమర్శల వాన మొదలైంది. ఆమె పాకిస్తాన్ కోడలని, ఆమెను ఎలా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తారని బీజేపీ వాళ్లు ధ్వజమెత్తారు. అయితే కేసీఆర్ వెనక్కు తగ్గలేదు. ఆమెకు కోటి రూపాయల ప్రోత్సాహకాన్ని ఇచ్చారు. ఆ తర్వాత రెండో సారి కోటి రూపాయల ప్రోత్సహకాన్ని ప్రకటించారు. మిక్స్ డ్ డబుల్ టైటిల్ ను గెలుచుకొని ఆ విజయాన్ని తెలంగాణకు అంకితమిచ్చిన సానియాను చూసి మురిసిపోయి కేసీఆర్ కోటి రూపయాల బహుమానం ఇచ్చాడు. అప్పుడు అయితే కేసీఆర్ పై మరిన్ని విమర్శలు వచ్చాయి. అయితే వాటిని కూడా కేసీఆర్ ఖాతరు చేయలేదు. మరి అప్పటి సంగతి అలా ఉంటే.. ఇప్పుడేంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఏకంగా సానియా రెండు పతకాలను సాధించుకొని వచ్చి కేసీఆర్ ను కలుస్తోంది! ఈ సారి కూడా కేసీఆర్ వెనక్కు తగ్గకపోవచ్చని... ఆమెకు కోటి రూపాయలు కానీ రెండు పతకాలకూ కలిపి రెండు కోట్ల రూపాయలు కానీ ప్రకటించవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరేం జరుగుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: