మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు... ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయివి! ఒకవేళ ముందస్తుగా అనుకొన్నట్టుగా పార్టీలు పాత పొత్తులతోనే పోటీ చేసి ఉంటే పెద్దగా ఆశ్చర్యపోయేదేమీ ఉండదు. అయితే ఇప్పుడు మాత్రం అక్కడ ఏం జరగబోతోంది.. అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగుతాయని అందరూ అనుకొన్న శివసేనా, భారతీయ జనతా పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ ఎన్సీపీల మధ్య కూడా బ్రేకప్ అయ్యింది. ఈ పరిణామం ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ఆసక్తిని రేకిస్తోంది. ఎన్నికల ముందు పొత్తు లేకుండా పోయిన నేపథ్యంలో ఎవరి సత్తా ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. ఈ చతుర్మఖ పోటికీ తోడు ఎమ్ ఎన్ ఎస్ వంటి పార్టీలు ఉండనే ఉన్నాయి. దీంతో భారీగా ఓట్ల చీలిక ఉండనుంది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, శివసేనాలు కలిసి పోటీ చేసి గ్రాండ్ విక్టరీని సాధించాయి. అయితే ఇప్పుడు వాళ్ల ఓట్ల నిలువునా చీలనున్నాయి. మరి ఇప్పుడు బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందా.... లేక శివసేనా ఎక్కువ సీట్లను సాధించి తన పట్టు నిలుపుకొంటుందా...? అనేది కూడా ఆసక్తికరమైన పరిణామమే! ఒకవేళ ఈ ఎన్నికల్లో బీజేపీ చతికిల పడితే ఆ పార్టీ కొంత కుంగిపోయినట్టే! మోడీ పై నమ్మకం తగ్గుతోంది చూడండి.. ఆయనపై ఉన్న మానియా తగ్గిపోతోంది చూడండి అంటూ... ప్రతిపక్షాలు విరుచుకుపడే అవకాశం ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో అత్యంత ప్రమాదం శివసేనా నుంచి పొంచి ఉంది. ఎలాగూ కాంగ్రెస్ , ఎన్సీపీలపై జనాలకు ఒక రకమైన విసుగు వచ్చింది. 15 సంవత్సరాల పాటు పాలించిన ఆ కూటమి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇటువంటి పరిణామాల మధ్య శివసేనా గనుక మరాఠా ప్రజల ఎంపిక అయ్యిదంటే... బీజేపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది! అది దేశవ్యాప్తంగా ఆ పార్టీ వ్యవహారాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మహారాష్ట్ర ఎన్నికలు దేశ రాజకీయ పరిణామాలను ప్రభావితం చేస్తాయని కచ్చితంగా చెప్పవచ్చు!

మరింత సమాచారం తెలుసుకోండి: