ఆంద్రప్రదేశ్ రాజధానిని లక్ష ఎకరాలలో నిర్మిస్తామని రాష్ట్ర మంత్రులు పదే,పదే చెప్పడాన్ని పార్లమెంటు మాజీ సభ్యుడు యలమంచిలి శివాజి ఆక్షేపించారు.అసలు కృష్ణ,గుంటూరు జిల్లాలలో ఏ గ్రామ పరిధిలోను రెండువేల ఎకరాలు మించి లేదని, అలాంటప్పుడు ఎన్ని వందల గ్రామాలను ఖాళీ చేయిస్తారని శివాజి ప్రశ్నించారు.లాండ్ పూలింగ్ పద్దతిపైన, అలాగే లక్ష ఎకరాల ప్రచారంపైన ప్రజలలో ,ప్రతిపక్షాలలో వ్యతిరేకత వస్తోంది.లక్ష ఎకరాలు ఎలా సేకరిస్తారు?ఎక్కడ నిర్మిస్తారు.ఎన్నివేల కోట్లు ఇందుకు కేటాయిస్తారు?ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేస్తూ ప్రజలను మంత్రులు భయభ్రాంతులను చేస్తున్నారని వీరు విమర్శిస్తున్నారు.వ్యవసాయ శాస్త్రజ్ఞుడు జి.వి.రామాంజనేయులు కూడా పూలింగ్ పద్దతి వల్ల రైతులకు ఉపయోగం ఉండదని అబిప్రాయపడ్డారు.కాగా రాజధాని నిర్మాణంలో బిల‌్డర్లకు కూడా ముప్పై శాతం వాటా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కధనాలు వస్తున్నాయి.దీనిపై రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తూ మీడియాలో కదనాలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: